Home » IPL
ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ రసవత్తరంగా మారిన నేపథ్యంలో.. కేకేఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ రచిన్ రవీంద్ర ఐపీఎల్‌ను వీడాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడుతాడా? లేదా? అని చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సామర్థ్యాన్ని పదేపదే నిరూపించుకోవాల్సిన పరిస్థితే వస్తే అలాంటి వాతావరణంలో తాను ఉండబోనని స్పష్టం చేశాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వరుస మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అభిమానుల్లో నెలకొన్న అనుమానాలపై ముంబై ఇండియన్స్ క్లారిటీ ఇచ్చింది. గురువారం పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన అనంతరం స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈ విషయంపై మాట్లాడాడు.
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది.
గత కొన్ని రోజులుగా పంజాబ్ జట్టుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లేయర్లలో క్రమశిక్షణ, సమన్వయం లోపించాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్తలపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. వరుస ఓటములతో ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్య ఇన్ స్టా స్టోరీ తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో సీఎస్కే.. కర్ణాటక ప్లేయర్ మెక్‌నీల్ హ్యాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో అదిరే ఆటతో అందరి దృష్టిని తనవైపే తిప్పుకున్న పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు అనూహ్యంగా దెబ్బతింటోంది. వరుస ఓటముల నేపథ్యంలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు. తాము ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నామని.. తమకు మద్దతు ఇవ్వాలంటూ అభిమానులను కోరాడు.
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది. అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మ్యాచ్ అనంతరం జట్టు విజయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(61) ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్‌లో 500కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.