Home » Indian Navy
ఇండియన్ నేవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇండియన్ నేవీ హెలీకాఫ్టర్‌పై సముద్రపు దొంగలు తుపాకీతో దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో అది.
ఎర్ర సముద్రంలో పట్టు కోసం హౌతీ మిలిటెంట్లు జరుపుతున్న దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం సాయంత్రం ఓ నౌకపై హౌతీ మిలిటెంట్లు దాడులు జరపగా.. ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని గుర్తించిన భారత నేవీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్‌కతా.. ఒక భారతీయ పౌరుడితో సహా 21 మందిని సురక్షితంగా రక్షించింది.
హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త నావికాదళ స్థావరాన్ని భారత్ వచ్చే వారం ప్రారంభించనుంది. లక్షద్వీప్ లోని మినీకాయ్ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరానికి 'ఐఎన్ఎస్ జటాయు'గా పేరుపెట్టారు.
భారత నేవీని(Indian Navy) మరింత పటిష్టం చేసేందుకు రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో యుద్ధ నౌకలు, ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న భారత్ తాజాగా యుద్ధ విమానాల కొనుగోలుకు కూడా ముందుకొచ్చింది.
గూఢచర్యం(Espionage) ఆరోపణలపై ఖతార్(Qatar)లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది భారతీయ నావికాదళ మాజీ అధికారులకు విముక్తి లభించింది. భారత ప్రయత్నాలు ఫలించడంతో ఖతర్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేసినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది.
ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియన్ జెండాతో కూడిన వాణిజ్య నౌక హైజాక్ అయిన క్రమంలో అప్రమత్తమైన భారత నావికాదళం(indian navy) శుక్రవారం వెంటనే రంగంలోకి దిగి వారి చర్యలను కట్టడిచేసింది. అంతేకాదు వారిని సురక్షితంగా రక్షించి తీసుకురాగా..తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో వారు భారత్ మాతా కీ జై అంటు నేవీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సోమాలియా సరిహద్దులో హైజాక్ కి(Hijacked Cargo Ship) గురైన కార్గో నౌక "ఎంవీలిలా నార్‌ఫోర్క్"ను ఎట్టకేలకు భారత నేవీ అధికారులు గుర్తించారు. అందులో 15 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారని వారు తెలిపారు. వారి జాడ గుర్తించడంతో 15 మంది భారతీయులతోపాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
టెన్ ప్లస్ టూ(బీ టెక్) కేడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌ల్లో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేరేందుకు నావికాదళం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 35 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
భారతీయ సిబ్బందితో కూడిన ఓ నౌక హైజాక్ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 5 మంది సిబ్బందితో లైబీరియన్ జెండాతో కూడిన ఓడను సోమాలియా(Somalia) తీరానికి సమీపంలో హైజాక్(Ship Hijack) చేశారు.
15 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న షిప్ హైజాక్ అయ్యిందని నేవీ అధికారులు పేర్కొన్నారు. లైబీరియన్ జెండాతో కూడిన ఓడ సోమాలియా తీరం సమీపంలో హైజాక్ చేయబడింది చెప్పారు.