• Home » India

India

Obama Vs Modi : బరాక్ ఒబామా ఓ ప్రైవేట్ వ్యక్తి : అమెరికా

Obama Vs Modi : బరాక్ ఒబామా ఓ ప్రైవేట్ వ్యక్తి : అమెరికా

భారత దేశంలో మైనారిటీల రక్షణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama)ను అమెరికా ప్రభుత్వం సున్నితంగా పక్కనబెట్టింది. ఆయన పట్ల సమున్నత గౌరవం ఉన్నప్పటికీ, ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి అని, శ్వేత సౌధంతో ఆయనకు సమన్వయం లేదని తెలిపింది.

ఐర్లాండ్‌లో పర్యటించనున్న టీమిండియా.. మ్యాచ్‌ల వివరాలిదిగో!

ఐర్లాండ్‌లో పర్యటించనున్న టీమిండియా.. మ్యాచ్‌ల వివరాలిదిగో!

భారత్, ఐర్లాండ్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఇందుకోసం భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. వెస్టిండీస్ పర్యటన ముగిసిన 5 రోజుల్లోనే ఐర్లాండ్ పర్యటన ప్రారంభంకానుంది. టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా వారం రోజులపాటు ఐర్లాండ్‌లోనే ఉండనుంది.

India Summons Pak: సిక్కులపై పెరుగుతున్న దాడులు.. పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

India Summons Pak: సిక్కులపై పెరుగుతున్న దాడులు.. పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

సిక్కులపై పాకిస్థాన్‌లో పెరుగుతున్న దాడులను భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు పంపింది. సిక్కులపై దాడుల ఘటనపై వివరణ కోరింది. దాడుల ఘటనలపై విచారణ జరిపించాలని, సాధ్యమైనంత త్వరగా విచారణ నివేదికను అందజేయాలని అడిగింది

Jain Temple : కురచ దుస్తులు ధరించినవారికి ప్రవేశం లేదు : జైన దేవాలయం

Jain Temple : కురచ దుస్తులు ధరించినవారికి ప్రవేశం లేదు : జైన దేవాలయం

హైందవ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఉన్న వందేళ్లనాటి జైన దేవాలయం నిర్ణయించింది. హైందవ సంస్కృతి విలువలు, గౌరవ, మర్యాదలు క్రమశిక్షణను అమలు చేయాలని, దీనిలో భాగంగా కురచ దుస్తులు ధరించి వచ్చినవారిని ఈ దేవాలయంలోకి అనుమతించరాదని నిర్ణయించింది. డ్రెస్ కోడ్‌ను వివరిస్తూ ఓ నోటీసును ఏర్పాటు చేసింది.

Rebirth : గత జన్మ  సంగతులు చెప్తున్న బాలుడు.. అన్నీ నిజాలే అంటున్న కుటుంబ సభ్యులు..

Rebirth : గత జన్మ సంగతులు చెప్తున్న బాలుడు.. అన్నీ నిజాలే అంటున్న కుటుంబ సభ్యులు..

పునర్జన్మ సిద్ధాంతాన్ని చాలా మంది నమ్ముతారు. ఒక జీవికి అనేక జన్మలు ఉంటాయని విశ్వసిస్తారు. కొందరు అందుకే పిల్లలతో మాట్లాడేటపుడు ‘చచ్చి నీ కడుపున పుడతాను’ అంటారు. ఇలా పుట్టడం నిజమేనని ఉత్తర ప్రదేశ్‌లోని మయిన్‌పురి జిల్లాలో ఓ బాలుడి మాటలు విన్నపుడు భావించవలసి వస్తోంది. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకుని అందరూ అవాక్కవుతున్నారు.

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతిపై వీథి పోరాటాలు ఉండవు : జామియా చీఫ్

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతిపై వీథి పోరాటాలు ఉండవు : జామియా చీఫ్

ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code)ను తాము వ్యతిరేకిస్తున్నామని, అయితే తాము రోడ్లపైకి ఎక్కి నిరసన కార్యక్రమాలను చేపట్టబోమని జామియా చీఫ్ అర్షద్ మదానీ (Arshad Madani) ఆదివారం చెప్పారు. తమకు 1,300 సంవత్సరాల నుంచి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయని, ఇప్పటికీ తాము వాటికే కట్టుబడి ఉంటామని చెప్పారు.

S Jaishankar : భారత్‌కు గౌరవం దక్కకపోతే నేను తలక్రిందులవుతాను : విదేశాంగ మంత్రి

S Jaishankar : భారత్‌కు గౌరవం దక్కకపోతే నేను తలక్రిందులవుతాను : విదేశాంగ మంత్రి

భారత దేశానికి గౌరవం దక్కకపోతే తాను తలక్రిందులవుతానని, చాలా బాధపడతానని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) చెప్పారు. తనపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించేవారిని తాను పట్టించుకోనని, అయితే భారత దేశాన్ని గౌరవించకపోతే, ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తే, తాను తీవ్ర ఆవేదనకు గురవుతానని చెప్పారు.

Char Dham Yatra : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో నమోదైన భక్తులు

Char Dham Yatra : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో నమోదైన భక్తులు

ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు నమోదు చేసుకున్నారు. శనివారంనాటికి 46.56 లక్షల మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదైంది. శనివారంనాటికి ఈ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్‌నాథ్ (మరియు హేమకుండ్ సాహిబ్) క్షేత్రాలను దర్శించుకున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో 28.41 లక్షలకు చేరింది.

Wrestlers : రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. బ్రిజ్ భూషణ్‌పై ఫొటోలు, వీడియోల సాక్ష్యాలు..

Wrestlers : రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. బ్రిజ్ భూషణ్‌పై ఫొటోలు, వీడియోల సాక్ష్యాలు..

మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలను ఢిల్లీ పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఆయనపై ఆరుగురు మహిళలు ఫిర్యాదు చేయగా, నలుగురి ఫిర్యాదుల్లో ఫొటో సాక్ష్యాలు, ముగ్గురి ఫిర్యాదుల్లో వీడియో సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం.

Infiltration : చొరబాట్ల నిరోధక చర్యలు.. కశ్మీరులో ఐదుగురు ఉగ్రవాదులు హతం..

Infiltration : చొరబాట్ల నిరోధక చర్యలు.. కశ్మీరులో ఐదుగురు ఉగ్రవాదులు హతం..

మన దేశంలోకి అక్రమ చొరబాట్ల నిరోధక చర్యల్లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ-కశ్మీరు పోలీసులు శుక్రవారం తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరు మరణించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను సైన్యం, పోలీసులు సంయుక్తంగా గురువారం రాత్రి ప్రారంభించినట్లు చెప్పారు.

India Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి