Home » India vs West indies
టీంఇండియా(Team India) వెస్టిండీస్(West Indies) మధ్య రెండో టీ20(Second T20) ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ మరోసారి ఓటమి పాలయింది. విండీస్‌నే మరోసారి విజయం వరించింది.
భారత యువ క్రికెటర్, తెలుగుతేజం తిలక్ వర్మ తాజాగా ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత పిన్న వయసులోనే అర్థశతకం నమోదు చేసిన భారత ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీతో అతడు ఈ ఘనతని తన పేరిట లిఖించుకున్నాడు.
వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
కెప్టెన్ పావెల్(48), నికోలస్ పూరన్(41) రాణించడంతో మొదటి టీ20లో భారత్ ముందు వెస్టిండీస్ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు చాహల్(2/24), అర్ష్‌దీప్ సింగ్(2/31), కుల్దీప్ యాదవ్(1/20), హార్దిక్ పాండ్యా(1/27) కట్టడి చేయడంతో వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించలేకపోయింది.
తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కెరీర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ ఫీల్డింగ్ విన్యాసాలు అదిరిపోయాయి.
భారత్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో అతిథ్య వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే యువ పేసర్ ముఖేష్ కుమార్ కూడా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు.
టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 241 మ్యాచ్‌లాడిన సంజూ శాంసన్ 5,979 పరుగులు చేశాడు. దీంతో మరొక 21 పరుగులు చేస్తే టీ20ల్లో 6 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. టరుబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ రికార్డుకు చేరువలో ఉన్నాడు.
మొదటి మ్యాచ్‌తో భారత జట్టు 200 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. ప్రపంచంలోనే పొట్టి క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పనుంది.
భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి. మొత్తం ఏడుగురు భారత ఆటగాల్లు ఏడు రికార్డులకు చేరువలో ఉన్నారు.