Home » India vs Pakistan
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో ఓటమితో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ఆరంభ మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాతో తలపడి పరాజయం పాలైంది. భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.
ఈసారి ఎలాగైనా వరల్డ్‌కప్ గెలవాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఆదిలోనే భంగపాటు ఎదురైంది. ఆర్మీ వద్ద ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని మరీ సిద్ధమైన ఆ జట్టు..
టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఆదివారం సాయంత్రం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగి క్రికెట్ అభిమానులకు మంచి మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజీ క్రికెట్ సమరం షురూ అయ్యింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ పడింది.
టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 world cup 2024) హై వోల్టేజీ క్రికెట్ సమరంలో ముందుగా ఊహించినట్టే జరిగింది. వరుణుడి కారణంగా టాస్ వాయిదా పడింది. వర్షం పడుతుండడంతో టాస్‌ను వాయిదా వేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగబోతోంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా...
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో అసలు సిసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్...
భారత కాలమాన ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్‌కప్ మెగా టోర్నీ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మాత్రం...
భారత్, పాకిస్థాన్(India vs Pakistan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా ఆ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నెల రోజుల తర్వాత జరగనున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌నకు మరో 5 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ సారి పొట్టి ప్రపంచకప్‌నకు వెస్టిండీస్, అమెరికా అతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్‌లో జరిగే ఈ ప్రపంచకప్ షెడ్యూల్ గురించిన వార్తలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.