Home » ICC
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సైతం తన వక్రబుద్ధిని చూపించాడు. భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. టీ20 ప్రపంచ కప్-2026 నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ అంశంలో భారత్‌ను లాగి తన కుటిల బుద్ధిని చాటుకున్నాడు.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1993 నుంచి 1996 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు 1978 నుంచి 2014 వరకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌ను ఐసీసీ ఈ టోర్నీ నుంచి తప్పించడంతో పాక్ కూడా వైదొలుగుతుందన్న వార్తలు వచ్చాయి. ఐసీసీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో పీసీబీ వెనక్కి తగ్గి జట్టును ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో బంగ్లాకు మద్దతుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాక్‌పై ఐసీసీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. పాక్ క్రికెట్‌పై తీవ్ర ఆంక్షలు విధించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనంలో పేర్కొంది
వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ బహిష్కరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ టోర్నీలో ఎక్కువ శాతం మ్యాచులు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐకి చెందిన ఉమ్మడి తనిఖీ బృందం గురువారం ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించింది.
టీ20 ప్రపంచ కప్-2026లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఐసీసీని కోరిన విషయం విదితమే. అయితే.. బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో బీసీబీ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ నిర్ణయంపై తాజాగా బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందించారు.
భారత్‌లో టీ20 ప్రపంచ కప్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ ఈ విషయంపై స్పందించాడు. ప్రపంచ కప్ ఆడటంపై తాము మాట్లాడటం సురక్షితం కాదని వెల్లడించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌లో బంగ్లా ఆడనున్న మ్యాచుల వేదికలను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి మెయిల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ.. బీసీబీకి ఈ విషయంపై డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం.
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు తమ జట్టును ఇండియాకు పంపబోమని మొండి పట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో బిగ్ షాక్ తగిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను ఐర్లాండ్ తిరస్కరించింది.