Home » HYDRA
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్స్ పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా ఝళిపించింది.
Ranganath: అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్‌లో రెస్టారెంట్లు, హాస్టల్స్ ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వేలాది మంది స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు ఈ హాస్టల్స్‌లో ఉంటున్నారని అన్నారు. ఈ హాస్టల్స్ వల్ల ప్రతీ రోజూ అయ్యప్ప సొసైటీలో డ్రైనేజ్, సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతుందని చెప్పారు.
తెలంగాణ: మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. అయ్యప్ప సొసైటీలో నిబంధలకు విరుద్ధంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు.
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో భాగంగా హైడ్రా(HYDRA).. ఇకపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధమైంది.
Telangana: హైడ్రా మరో ముందడుగు వేసింది. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు హైడ్ర గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఇకపై హైడ్రా గ్రీవెన్స్ ప్రతీ సోమవారం ఉండనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైడ్రా పోలీస్‌స్టేషన్ కూడా సంక్రాంతికి ప్రారంభంకానుంది.
గ్రేటర్ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్ధారణ ప్రక్రియ ఇటీవల వేగవంతం అయింది. చెరువుల సంరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ(ఎల్‌పీసీ) ఏర్పాటై పదేళ్లు అవుతుంది.
అక్రమ కట్డడాలపై ఓవైపు హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నా, అనుమతుల్లేని నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నా.. ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారు ఏమాత్రం వెనకాడటంలేదు.
ఖాజాగూడ(Khajaguda)లోని భగీరథమ్మ, తౌటోనికుంటల వద్ద ఆక్రమణల తొలగింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్థానికులూ మండిపడుతున్నారు.
హైదరాబాద్ నేరేడ్‌మెట్ డివిజన్ డిఫెన్స్‌కాలనీ పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. మంగళవారం హైడ్రా, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టి.. నిర్మాణాలతోపాటు.. రేకుల షీట్లను తొలగించారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నానక్‌రామ్‌గూడ-ఖాజాగూడ రహదారికి ఇరువైపులా ఉన్న భగీరథమ్మ కుంట, తౌటోనికుంట బఫర్‌జోన్‌లలో వేసిన రేకుల షెడ్లను హైడ్రా కూల్చివేసింది.