Home » Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి ప్రకోపం చల్లారడం లేదు. వరదలతో అతలాకుతలమైన ఈ రాష్ట్రంలో తాజాగా కొండచరియ విరిగిపడటంతో ఏడు బహుళ అంతస్థుల భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని కాపాడటం కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి.
సుఖ సంతోషాలను పక్కన పెట్టి.. కుటుంబాలకు దూరంగా.. దేశ రక్షణే ధ్యేయంగా పని చేస్తుంటారు ఆర్మీ జవాన్లు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు. అందుకే సైనికులు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అమితమైన గౌరవమర్యాదలు లభిస్తుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సైనికుడు ..
ఫ్యాంటసీ సినిమాల్లో రైళ్లు, పెద్ద పెద్ద వాహనాలు గాల్లో తేలడం చూసే ఉంటారు. కానీ.. రియల్ లైఫ్‌లో రైల్వే ట్రాక్ గాల్లో తేలడం ఎప్పుడైనా చూశారు. ఈ అరుదైన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో...
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు తోడు క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా భారీ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి.
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా సిమ్లాలోని శివాలయం కూలిపోయింది. ఈ ఘటనలో ఏకంగా 9 మంది మరణించారు.
ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలకు కకావికలమవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని డిఫెన్స్ కాలేజీ భవనం పేకమేడలా కుప్పకూలింది.
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొండచరియలు విరిగిపడి రోడ్డు మార్గాలు స్తంభించిపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.
కాంగ్రెస్ నేతత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆపిల్ పండ్ల రైతులకు అండగా నిలవడం లేదని బీజేపీ ఆరోపించింది. ఆపిల్ పండ్లను రైతులు కాలువల్లో పారబోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల కోసం రాహుల్ గాంధీ కన్నీరు పెట్టుకుంటారని, వాస్తవంలో కాంగ్రెస్ రైతులకు అండగా నిలవడం లేదని దుయ్యబట్టింది.
ఎంత బట్టీ కొట్టించినా 60 తెలుగు సంవత్సరాల పేర్లలో సగం కూడా చెప్పలేని వారు యువన్ తెలివి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన యమునా నది శనివారం ఉదయం నుంచి క్రమంగా శాంతిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద నీటి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఈ నదిలో నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు ప్రమాద స్థాయికి మించి, అంటే 207.58 మీటర్లు ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి.