Home » Harish Rao
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకాలపై విచారణ జరుపుతున్న కమిషన్ జూన్ 5న మాజీ సీఎం కేసీఆర్‌కు సమన్లు జారీ చేసింది. హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
అంగన్‌వాడీ సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జీతాలు నిలిపివేయడం వల్ల వారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని వాదిస్తున్నారు.
నల్లమల బిడ్డనంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి.. తనను కలిసేందుకు వచ్చిన అమాయక చెంచుబిడ్డలను అరెస్టు చేయించడం ఆయన నిరంకుశత్వానికి నిదర్శనమని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
ఇష్టం వచ్చినట్లు మద్యంఽ ధరలు పెంచి, తాగుబోతుల ద్వారా రాష్ట్ర ఖజానా నింపాలని చూస్తారా? బీర్లను, బార్లను నమ్ముకొని రాష్ట్రంలో పాలన కొనసాగిస్తారా అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీమంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
లక్షల మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
KTR Meets Harish: మాజీ మంత్రి హరీష్‌రావుతో కేటీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కోకాపేటలోని హరీష్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ దాదాపు రెండు గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారు.
కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీశ్‌రావు చెప్పడంలో అర్థం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారి కుటుంబంలో ఎవరి నాయకత్వమైనా తేడా ఏముంటుందని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ అజ్ఞానిలా మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ ఆరోపించారు. రాజకీయ నాయకుల సూచనలు పాటిస్తే ఊచలు లెక్కపెడతారని ఇంజినీర్లను హెచ్చరించడం ఏంటని నిలదీశారు.
బీఆర్‌ఎస్ నాయకత్వ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తానని హరీశ్ రావు అన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
బీఆర్‌ఎస్ పార్టీలో ఎలాంటి పంచాయితీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. పార్టీ మారుతానని.. జరుగుతోన్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని సూచించారు.