Home » Hanuman Jayanti
Telangana: నగరంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిటీలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలు సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. దీంతో వీర హనుమాన్ దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది.
రేపు (మంగళవారం) హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రేపు ఉదయం 11:20 గంటలకు ఆంజనేయుని శోభా యాత్ర ప్రారంభం కానుంది.
మందు బాబులకు మళ్లీ షాక్. ఆరు రోజుల వ్యవధిలోనే మద్యం ప్రియులకు అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణలో మంగళవారం (ఏప్రిల్ 23) నాడు నగర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేది నాడు మద్యం షాపులు, వైన్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ఆరు రోజులు తిరగకముందే అంటే రేపు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
భీకర ఆకారుడై, వందయోజనాల దూరం అవలీలగా లంఘించిన హనుమ.. లంకలో ప్రవేశించి..!