Home » Guntur
గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం అత్తోటలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఎర్రు బాపారావు ఆధ్వర్యంలో ‘కూటమి’ ప్రభుత్వంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పోసాని కృష్ణమురళీని కలిసేందుకు వైసీపీ నేత అంబటి రాంబాబు, ఆ పార్టీ శ్రేణులు గుంటూరు జైలు వద్దకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఓ యువకుడు జైలు వద్దకు వచ్చాడు.
వైసీపీ అధికారంలో ఉన్నపుడు హద్దూపొద్దూ లేకుండా ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇప్పుడు గుంటూరు మెజిస్ట్రేట్ ముందు ఆవేశంతో ఊగిపోయారు. తన తప్పు ఉందని తేలితే మెడ నరికేయండి అంటూ రెచ్చిపోయారు.
గుంటూరు జడ్జి ఎదుట పోసాని కృష్ణమురళీని సీఐడీ పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ హయాంలో ముంబై నటి జత్వానీపై వైసీపీ నేత విద్యాసాగర్ వేధింపులకు పాల్పడ్డాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆగమేఘాల మీద ముంబై వెళ్లి జత్వానీ కుటుంబాన్ని అరెస్టు చేశారు.
బోరుగడ్డ అనిల్ కోసం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు.ఫాస్టర్‌ను బెదిరించిండంతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పీటీ వారెంట్‌పై అనిల్‌ను అదుపులోకి తీసుకోనున్నారు.
నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు అయింది. అయితే విడుదలకు బ్రేక్ పడింది. సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టులో హజరుపర్చనున్నారు. మంగళవారం పోసానికి కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు షాక్ ఇచ్చారు. బుధవారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి స్వల్ప ఊరట లభించింది.
గత టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య రాజధాని అమరావతి నిర్మాణం కోసం దాదాపు 34 వేల ఎకరాలు సేకరించిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ భూముల్లో రాజధాని నిర్మించేందుకు రూ.43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు సైతం పిలిచినట్లు గుర్తు చేశారు.