Home » Gudivada Amarnath
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన దాడిని ప్రధానితో సహా అందరూ ఖండించారని... జగన్ ఏం తప్పు చేశారని రాళ్ళు విసురుతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాళ్ళ దాడి చేస్తే జగన్ ఇంటిలో కూర్చోటారని అనుకుంటే... అది పొరపాటే అని చెప్పుకొచ్చారు. సింపతీ కోసం.. దాడులు చేయించుకోవలసిన అవసరం తమకు లేదన్నారు. గాజువాక సభలో చంద్రబాబు తమ మీద చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గాజువాకలో బాబు మీద ఆ పార్టీల వాళ్ళే రాళ్ళు వేసుకొని .. వైసీపీ మీద అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్(Pawan Kalyan) దూసుకెళ్తున్నారు. అధికార వైసీపీ, సీఎం జగన్‌పై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం నాడు అనకాపల్లి జిల్లాలోని నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ‘వారాహి విజయభేరి’ భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath)పై సెటైర్లు గుప్పించారు.
Andhrapradesh: మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ట్విట్టర్ వేదికగా సెటైర్ విసిరారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు చాలా భవిషత్ ఉందని, గుండెల్లో పెట్టుకుంటానంటూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రణవ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘‘విగ్రహానికి ఉత్సవ విగ్రహానికి తేడా తెలుసుకోవాలి గౌరవ మంత్రి అమర్నాథ్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన చేయూత బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని స్పష్టం చేశారు. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్‌ను నియమించారని తెలిపారు. ‘‘చాలా మంది నీ పరిస్థితి ఎంటి ఎక్కడ పోటీ చేస్తావని నన్ను అడుగుతున్నారు’’ అని అన్నారు.
ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. వాటిని పర్యాటక రిసార్ట్స్‌గా వినియోగిస్తున్నట్టు తెలిపారు. పరిపాలనా రాజధాని నిర్ణయం మేరకు రుషికొండ నిర్మాణాలను.. త్రిసభ్య కమిటీ సీఎం కార్యాలయంగా ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతోందన్నారు.
Andhrapradesh: మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక దళిత మహిళ అయిన తనపై... మంత్రి గుడివాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రెస్‌మీట్‌లోనే అనిత కోడి గుడ్లు పగలు కొట్టారు.
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్‌కు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అవినీతి చేసినట్టు కానీ, భూ ఆక్రమణలకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను అంటూ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్‌నే ఏమీ పీకలేకపోయారు... నువ్వెంత అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రాన్ని గొడ్డలితో నరికినట్టు విభజించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు మీకు ఎవరు ఇచ్చారని నిలదీశారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద తాము సైనికులమని... ఆయన అనుకుంటే ఎవ్వరిని ఎక్కడైనా కూర్చోబెడతారని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) అన్నారు.
సీఎం పదవి రాజ్యాంగానికి లోబడి ఉంటుంది. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఇది అసలు వర్తించదు అనేలా వారి చర్యలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలంటే రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసి ఉండాలి.