Home » God
సఖినేటిపల్లి లంక గ్రామంలో అద్భుతం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.
పట్టణ పరిధిలోని నింకంపల్లి రోడ్డులో వెలసిన ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రతి యేటా ఆ నవాయుతీగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం లో భాగంగా ఉదయం అమ్మవారికి వి విధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. పెద్ద సంఖ్యలో మహిళ లు ఊరేగింపుగా బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.
మడకశిర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని చంద్రబావి గ్రామంలో వెలసిన దత్తత్రేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మె ల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
మండలంలోని నిడిమామిడి పంచాయతీ గ్రామంలో శుక్రవా రం నిర్వహించిన ఉట్లపరుష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి యేటా మాదిరి గానే తొలి ఏకాదశి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్లపరుషలో నిడిమామిడి పంచా యతీలోని కత్తివారిపల్లి తదితర ఏడుగ్రామాల యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇం దులో తిరుపాల్ అనే యువకుడు విజేతగా నిలిచాడు. ఉత్సవం సందర్భంగా ముఖ్య అతిథు లుగా గ్రామానికి వచ్చిన ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, మా జీమంత్రి పల్లె రఘునాథరెడ్డికి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.
గూగూడు కుళ్లాయిస్వామి చివరి దర్శనం వేడుకను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం రెడ్డి వంశీయులు కుళ్లాయిస్వామి పీరును ఆలయం వెలుపలకు తీసుకువచ్చి, గంటపాటు భక్తులకు దర్శనం కల్పించారు. కుళ్లాయిస్వామి గోవిందా గోవింద అంటూ భక్తులు గోవింద నామస్మరణం చేశారు. స్వామివారి చివరి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున ...
తా లూకాలోని దాదాపు 15గ్రా మాల ఇలవేల్పు గా కొలిచే లక్ష్మీ నరసింహ స్వా మి జాతర మ హోత్సవాన్ని ఆ షాఢ ద్వాదశి రోజైన గురువా రం మీనకుంటపల్లిలో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఎద్దులబండ్లను, గొర్రెలు, మేకలను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించా రు. అదేవిధంగా రాంపేట గ్రామం నుంచి పాలకడవలతో పూజారులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా... మహిళలు జ్యోతులు మోస్తూ వారిని అనుసరించారు. ప్రదక్షిణల అనంతరం పాలకడవలతో స్వామివారి విగ్రహాలకు అభిషేకం చేశారు.
పట్టణంలోని చెరువురోడ్డు సమీపంలో కొండపై వెలసిన ఘనగిరి గర్జ ఆంజనేయస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామికి గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయ సమీపంలో సాయంత్రం నిర్వ హించిన ఉట్లపరుష భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఉట్లమాను ఎక్కడానికి యువ కులు పోటీ పడ్డారు.
తొలిఏకాదశిని పురస్కరించుకుని బుధవారం మండల పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అలాగే లేపాక్షిలోని దుర్గా, వీరభద్రస్వామి ఆలయంలో వెలసిన విష్ణుమూ ర్తిని ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు.
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. జలధి కార్యక్రమం బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవం అనంతరం తెల్లవారుజామున వెండిగొడుగులు సహా అగ్నిగుండ ప్రవేశం చేశారు. కుళ్లాయిస్వామి గోవిందా గోవింద అంటూ భక్తులు నినదించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అగ్నిగుండ ప్రవేశాన్ని తిలకించారు. స్వామివారు సాయంత్రం రెండోసారి అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం భక్తులు విషాద వదనంతో, కన్నీరు కారుస్తూ గ్రామ సమీపంలోని బావిలో జలధి కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు దూర ప్రాంతాల నుంచి ...
గూగూడు కుళ్లాయిస్వామి పెద్ద సరిగెత్తు వేడుక మంగళవారం కన్నులపండువగా సాగింది. క్షేత్రంలో కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి దర్శనాల కోసం ఉదయం నుంచే భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. రాష్ట్ర నలుమూలల నుంచి, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు గూగూడుకు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ‘కుళ్లాయి స్వామి గోవిందా.. గోవింద..’ అనే నినదాలతో క్షేత్రం మార్మోగుతోంది. మొక్కుబడి ఉన్న కుటుంబాలవారు కాలిన ..