Home » Gautam Gambhir
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. గంభీర్‌కు బీసీసీఐ మద్దుతుగా నిలిచింది.
ఇటీవల టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను తప్పించాలనే డిమాండ్స్ పెరిగాయి. అయితే గౌతమ్ గంభీర్‌కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్‌గా తన పని తాను చేస్తున్నాడన్నాడు. ఓటములకు కోచ్ కన్నా కూడా ఆటగాళ్లే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాడు
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ పరోక్షంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
టీమిండియాలో మూడో స్థానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్రంగా స్పందించాడు. మూడో స్థానంపై ప్రయోగాలు చేయొద్దని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. దీంతో హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఈ విషయంపై స్పందించాడు. కోచ్‌గా ప్లేయర్లకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వాల్సింది మీరేనని గంభీర్‌కు సూచించాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పిచ్ వివాదంపై స్పందించాడు. ఇలాంటి పిచ్‌లను కోరడం మానుకోవాలని సూచించాడు.
సౌతాఫ్రికాపై టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో పిచ్, కోచ్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గంభీర్‌కు మద్దతుగా నిలిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. అతడి తప్పుడు నిర్ణయాల వల్లే టీమిండియా ఓడిందని నెటిజన్లు ఫైరవుతున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోరంగా ఓడింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ స్పందించాడు.
ఢిల్లీ ఘటనలో మృతి చెందిన వారికి టీమిండియా కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంతాపం తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికా పోస్ట్ పెట్టాడు. ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా ప్రాణనష్టం సంభవించడం బాధాకరమని అన్నాడు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని గంభీర్ తన ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.