Home » Gandhi Bhavan
గాంధీభవన్లో బుధవారం జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చీకటి కార్తీక్ ఎన్నికపై ఆ జిల్లాకు చెందిన పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది.
సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి బన్నిని విడుదల చేశారు. అయితే ఎపిసోడ్ కీలక ములుపులు తిరుగుతోంది.
సమసమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దివంగత ప్రధాని, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్థి పథంలో నడిపిన దార్శనికుడని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
కుల గణనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోగల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాలకు చెందిన వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టనున్నది. వచ్చేనెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వేను ప్రారంభించనున్నారు. దీనిపై చర్చించేందుకు బుధవారం గాంధీ భవన్‌లో కీలక సమావేశం జరగనుంది.
గాంధీభవన్లో మంగళవారం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి గాంధీభవన్లో ఉండనున్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.
రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డుల కోసం ప్రజలు ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమానికి రావాల్సిన అవసరంలేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
వారంలో రెండ్రోజులు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కో మంత్రి అందుబాటులో ఉండే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
ఇకపై మంత్రులు ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ మూడు గంటలపాటు గాంధీ భవన్ వద్ద అందుబాటులో ఉండనున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
ఇకపై ప్రతి వారం.. బుధ, శుక్ర వారాల్లో ఎవరైనా ఒక మంత్రి.. గాంధీ భవన్‌లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.