Home » Gachibowli
అభివృద్ధిలో స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. భాగ్యనగర అభివృద్ధికి ఎవరూ అడ్డుపడినా ఊరుకునేది లేదని హెచ్చరిచారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధిపైనే తమ దృష్టి అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఇమ్మనేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు.
కంచ గచ్చిబౌలి భూములను తనఖా పెట్టి టీజీఐఐసీ ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్న విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ సెబీ చైర్మన్కు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు.
కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ చైర్మన్కు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు, ఆధారాలతో సెబీకి గురువారం హరీష్రావు లేఖ రాశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు టీజీఐఐసీ ద్వారా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలను లేఖలో హరీష్రావు ఎండగట్టారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎ్సబీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినె్స)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాంపస్ లోని క్వార్టర్స్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
గ్రేటర్ పరిధిలో ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో ఆశించిన స్థాయిలో ధరలు పలకలేదు. ఇటీవల కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ఓ స్థలానికి గజం ధర రూ.2.98 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.
International Yoga Day Celebrations in Hyderabad: హైదరాబాద్ (Hyderabad Yoga Event) గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) (International Yoga Day 2025) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీఎస్ రామకృష్ణారావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై యోగా విశిష్టతను గురించి ప్రజలకు వివరించారు.
Yoga Day Stampede: యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ యువతి స్పృహకోల్పోయింది.
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది.
AIG Hospital: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.