Home » Fire Accident
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆస్పత్పిలో చికిత్స పొందుతో గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది పూర్తి నివేదికతో ప్రభుత్వం దృష్టి సారించింది.
పరవాడ ఫార్మాసిటీలో ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
హైదరాబాద్ నగరలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్‌వి ఫ్యాబ్ పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం మంటలు మొదలయ్యాయి. రాత్రి దాదాపు 1గంట ప్రాంతంలో మూడంతస్తుల భవనం 75 శాతం కూలింది. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్‌కు సంబంధించిన ముడి సరుకు ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. వాటిని ఆర్పేందుకు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 4 గంటలుగా శ్రమిస్తున్నా.. మంటలు మాత్రం అదుపులోకి రాలేదు.
తిరుమలలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
అనేక మంది పిల్లలు ఉన్న మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు మరణించారు. ఈ విషాధ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలో చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఇంజన్ నుంచి రెండో బోగీలో అకస్మాత్తుగా మంటలు వచ్చినట్టు తెలిసింది. దీంతో 45 నిమిషాల పాటు బరూచ్ సిల్వర్ బ్రిడ్జి సమీపంలో రైలును ఆపేశారు. వెంటనే ప్రయాణికులు రైలు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పెద్ద ఎత్తున పేలుడు, మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల కంపెనీలు, ప్రజలు భయందోళనలకు గురయ్యారు. మంటలు ఎగసిపడటంతో వెంటనే రిఫైనరీలోని కార్మికులను సురక్షింతంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని రంజోల్ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్ నుంచి జహీరాబాద్ మీదుగా హైదరాబాద్‌కు కంటైనర్‌లో 8 టాటా నెక్సాన్ కార్లను తరలిస్తుండగా షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.
హైదరాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు వన్‌లో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.