Home » Facebook
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ(Meta AI) సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఫేస్ బుక్‌లో మెటా చాట్ బాట్ అందుబాటులోకి ఉంది. తాజాగా వాట్సప్, ఇన్ స్టాగ్రామ్‌లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది.
అమాయకులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు(Cyber criminals) రోజురోజుకీ కొంతపంథా ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన ఎమ్మెల్యేల పేరిటా మోసాలకు దిగుతున్నారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే పోస్ట్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మినలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వాట్సాప్, ఫేస్‌బుక్, ఇనస్టాగ్రాం తదితర సోషల్ మీడియాలో చాలా మంది రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇళ్లను ముట్టడిస్తాం, దాడులు చేస్తామని బెదిరిస్తూ, తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అవాస్తవాలు ..
ఫేస్‌బుక్ అనతికాలంలోనే అంటే ఆరంభించిన ఇరవై సంవత్సరాల్లోనే అన్ని వర్గాల ఆదరణ పొందింది. మరీ ముఖ్యంగా గడచిన మూడేళ్ళలో యువతకు మరింత చేరువైంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ స్వయంగా ప్రకటించింది. అమెరికా, కెనడాలోనే 18-29 మధ్యవయస్కులైన నాలుగుకోట్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కలిసొచ్చే ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. ఒకవైపు పాతపద్ధతిలో ఇంటింటి ప్రచారం చేస్తూనే మరోవైపు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)తో ‘స్మార్ట్‘గా ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఆమె ఫేస్‌బుక్(Facebook) ద్వారా బడాబడా పారిశ్రామికవేత్తలతో పరిచయం పెంచుకుంటుంది.. అది కాస్తా స్నేహంగా మలచి తన ఇంటికి ‘ఆతిథ్యానికి’ ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వారిని బందించి నగలు, నగదు లాగేసుకుంటుంది.
తమ వినియోగదారుల సందేశాలకు సంబంధించి ఎన్‌క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని బలవంతం చేస్తే నిరభ్యంతరంగా భారత్ నుంచి వైదొలుగుతామని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టం చేసింది.
Andhrapradesh: సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్‌లతో సెలబ్రెటీస్‌ను, ప్రముఖులను కూడా సైబర్ నేరగాళ్లు ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చేరారు. యూనిఫాంలో ఉన్న ఆయన ఫోటోతో, పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను కేటుగాళ్లు రూపొందించారు.
ప్రముఖ సామాజిక మాధ్యామాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు మంగళవారం అర్ధారంతరంగా నిలిచిపోయాయి. సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి పని చేయకపోవడంతో యూజర్లు కంగారుపడ్డారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో నెలకొన్న అసమ్మతి ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడంతో మొదలైన రగడ, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినప్పటికీ.. మంత్రి విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా మారారు.