Home » Elon Musk
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్ తీసుకొస్తామని ప్రకటించారు. మస్క్ ప్రకటించారో లేదో ఎక్స్ మెయిల్ కోసం ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దేశంలో ఇటివల రైతుల నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్‌పై ఆంక్షలు మొదలయ్యాయి. రైతుల నిరసనలకు సంబంధం ఉన్న నిర్దిష్ట ఖాతాలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం X (గతంలో ట్విట్టర్)కు ఆదేశాలు జారీ చేసింది.
ఎలాన్ మస్క్ సగటున గంటకు రూ.3 కోట్లు సంపాదిస్తున్నాడని తాజాగా ఓ సంస్థ అంచనా వేసింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
మానవ మెదడు, కంప్యూటర్‌ల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్‌ను ఏర్పరచడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘న్యూరాలింక్ స్టార్టప్’ కీలక ముందడుగు వేసింది. మొట్టమొదటిసారి ఒక మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్‌ను విజయవంతంగా అమర్చింది.
ఎలాన్ మస్క్ ఎక్స్ యాప్ (గతంలో ట్విట్టర్) నుంచి త్వరలో మరో ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఈ సంస్థ కంటెంట్, భద్రతా నియమాలను అమలు చేయడంలో భాగంగా కొత్త "ట్రస్ట్ అండ్ సేఫ్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"ని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
ప్రపంచ సంపన్నుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రెండవ స్థానానికి దిగజారారు. ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ దిగ్గజ కంపెనీ ‘ఎల్‌వీఎంహెచ్’ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ మరోసారి ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా అవరించారు. ఆర్నాల్ట్ నికర సంపద విలువ శుక్రవారం నాటికి 207.8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందగా ఎలాస్ మస్క్ ఆస్తి విలువ 204.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
మీరెప్పుడైనా టీషర్టులు మడతపెట్టిన రోబోలను చుశారా? లేదా అయితే ఇక్కడ చుసేయండి. తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ కొత్త వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ప్రపంచ బిలియనీర్, టెస్లా కార్ల వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తన EV కార్ల ధరలను ఇండియాలో తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా వేగంగా ఛార్జింగ్ చేసే చిన్న బ్యాటరీలను ఇక్కడి కార్లలో ఉపయోగించాలని చూస్తున్నారు.
ఇప్పటికే ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) మరో సంస్థ వోడాఫోన్( Vodafone Idea)లో వాటాను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పెరిగాయి. ఈ క్రమంలోనే సంస్థ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.