Home » Elections
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 236 సీట్లతో అధికార కూటమి మహాయుతి భారీ విజయం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. దేవేంద్ర ఫడ్నవిస్‌ను మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చూడాలని బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తమ కోరికను వ్యక్తం చేశాయి. మరోవైపు శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.
మహారాష్ట్ర శాసనసభ పదవీకాలం నవంబర్ 26తో ముగుస్తుంది. శాసనసభ పదవీ కాలం ముగిసేలోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. అంటే నవంబర్ 26లోపు మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా ఆలస్యం జరిగి నవంబర్ 26లోపు సీఎం ప్రమాణ స్వీకారం జరగకపోతే..
మహారాష్ట్ర ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో మహాయుతి కూటమి కొలువుదీరనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక, అత్యల్ప మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బీఎల్‌వోలు బాధ్యతగా పని చేయాలని ఈఏఎస్‌వో (ఎలక్షన్ అసిస్టెంట్ సెక్షన్ అధికారి) చిన్న వెంకటేశ్వర్లు అన్నారు.
Maharashtra Election Results-KK Survey: మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు దాదాపు ఖరారయ్యాయి. రాష్ట్రంలో మహాయుతి(ఎన్డీయే) కూటమిదే మరోసారి అధికారం అని ఎలక్షన్ కౌంటింగ్
మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోటా ఎన్డీయే అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. బల్లార్‌పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్‌పూర్, కస్బాపేట్, డెగ్లూర్, లాతూర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్థులను గెలిపించాలంటూ పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు.
ప్రజా సంక్షేమానికి కృషి చేయడంతోనే ప్రజలు తమను ఈ ఎన్నికల్లో ఆదరించారని.. తమ విజయానికి ఇదే కారణమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉద్ధాటించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్‌లో ఎన్డీయే బంపర్ విజయం దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే 220 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే రాష్ట్రానికి కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి పట్టిన గతే తెలంగాణ కాంగ్రెస్‌కు పడుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఇంకొకరికి ఇవ్వరని... వాళ్లలో వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు కాసేపట్లో పూర్తికానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడ 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి మళ్లీ అధికార కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.