Home » Election Commission
బిహార్లో ఎన్నికల కమిషన్ ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఐఎస్ఆర్ కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బిహార్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత తనిఖీ చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఈసీ నిర్ణయించింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఆగస్టులో ఓటర్ల జాబితా సవరణని ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
ఎన్నికల కమిషన్ బిహార్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవడానికి కేవలం 2నెలల ముందు బిహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమని ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)’పై వివాదం ముదురుతోంది.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఒక దేశం-ఒకే ఎన్నిక విధానం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు సీజేఐలు పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ బిహార్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ రాజ్యాంగ వ్యతిరేకమని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఏడీఆర్ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానివల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని తెలిపింది.
YSRCP leaders Meets EC: ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగిందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయని.. దీనిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్ ఈ-ఓటింగ్ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బిహార్‌లో ప్రారంభించారు. దీంతో మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం బిహార్ ఓటర్లకు దక్కింది.
ఓటర్లకు పుట్టిన తేదీ, జన్మించిన ప్రదేశంతో కూడిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది.