Home » Election Commission
ఈనెల 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ఉండగా 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లు, కలెక్టర్లతో హోం మంత్రి అమిత్‌షా ఫోనులో మాట్లాడారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఇందుకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ఆదివారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తమకు షేర్ చేయాలని జైరామ్ రమేష్‌ను కోరింది.
దాదాపు ఏడు వారాలుగా కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల రణరంగానికి ఇక తెర పడనుంది. ఏడు దశలుగా జరుగుతున్న ఎన్నికల్లోని చివరి దశకు పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇ
కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆందోళనలను ప్రేరేపించేలా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు.
ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో అంటే జూన్1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు తాము సేకరించిన డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేదానిపై ఓ అంచనా వచ్చి ఎగ్జిట్ పోల్స్‌ను విడుదలచేస్తాయి.
బీఆర్‌ఎస్ పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకే అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్ కుమార్ నియోజకవర్గాలవారీగా నిర్వహించిన సర్వేలో.. బీఆర్‌ఎస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని తేలింది.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో 63.37ు పోలింగ్ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం ప్రకటించింది. ఈసీ గణాంకాల ప్రకారం.. ఎనిమిది రాష్ట్రాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు మే 25న జరిగిన పోలింగ్‌లో 7.05 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేశారు. ఓటు హక్కును
ఎన్నికల అధికారులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆరోపించారు. నియోజకవర్గంలో అధికారులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు చెప్పిన విధంగానే అధికారులు నడుచుకుంటున్నారని తాము ఐదేళ్లుగా మెుత్తుకున్నామన్నారు. ఎన్నికలు మొదలయ్యాక కూడా కొంతమంది అధికారుల తీరు మారలేదన్నారు.
ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడి, తద్వారా ప్రజాతీర్పును మార్చే యత్నాల్లో అధికార పార్టీ బీజేపీ ఉన్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని 120కిపైగా పౌరసంస్థలు తీవ్ర ఆరోపణ చేశాయి.