Home » Election Commission of India
బిహార్‌లో ఎన్నికల కమిషన్ ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఐఎస్ఆర్ కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఆగస్టులో ఓటర్ల జాబితా సవరణని ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
భువనేశ్వర్‌లో శుక్రవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావో సమావేశ్'లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ వింగ్‌గా ఈసీఐ పని చేస్తోందని అన్నారు.
ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ అధికారాన్ని ఎన్నికల కమిషన్ కలిగి ఉంటుందని రాజ్యాంగంలోని 324వ అధికరణ చెబుతోంది. 326వ అధికరణ ఓటర్ల రివిజన్ ఎక్సర్‌సైజ్‌తో అడల్ట్ ఇండియన్ సిటిజన్లకు ఓటు హక్కును తప్పనిసరి చేస్తోంది.
బిహార్‌లో నాలుగునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ తీవ్ర రాజకీయ దుమారం రేపింది
ఆర్జేడీ తరఫున పిటిషన్ సమర్పించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దీనిపై సోమవారంనాడు విచారణ చేపట్టాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఆర్జేడీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా ఈ పిటిషన్ వేశారు.
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్షను ఈసీఐ నిర్వహిస్తుండటంతో దీనిని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఈసీఐ బీహార్‌లో చేపబట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష అమలును తక్షణం ఆపివేయాలని, ఇతర రాష్ట్రాల్లోనూ ఈసీఐ ఇలాంటి ఆదేశాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశించాలని మహువా మొయిత్రా తన పిటిషిన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్ ఈ-ఓటింగ్ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బిహార్‌లో ప్రారంభించారు. దీంతో మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం బిహార్ ఓటర్లకు దక్కింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ ఇటీవల ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నియోజకవర్గంలో 8 శాతం ఓటర్లు పెరిగారని అన్నారు.