Home » Election Campaign
ఒక్క చాన్సపేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన ప్రభుత్వం అవినీతి, అరాచకాలకు ఒడిగట్టిందని... మళ్లీ వైసీపీకి ఓటేస్తే జనం ఫ్యానకు ఉరివేసుకోవాల్సిందేనని టీడపీ కూటమి ఎమ్మెల్యే అ భ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె బుధవారం రొద్దం మండల పరిధిలోని సానిపల్లి, గొబ్బరంపల్లి, బొమ్మిరెడ్డి పల్లి, నల్లూరు, చోళేమర్రి, కల్లుకుంట, చిన్నమంతూరు, దందేపల్లి, పీ కొత్తపల్లి, పెద్దమంతూరు, చెరుకూరు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ ఐదేళ్లకాలంలో వైసీపీ ప్రభుత్వం అనేకమంది టీడీపీ నాయకులు, కార్య కర్తలపై అక్రమ కేసులు బనాయించిందన్నారు.
భూములను నకిలీ ఆధార్ కార్డులతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయడంలో విశ్వేశ్వరరెడ్డికి ఉన్న శ్రద్ధ, అభివృద్ధిపై లేదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. కూడేరు మండలం జయపురం, చోళసముద్రం, కూడేరు, కమ్మూరు, అరవకూరు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు గ్రామాల్లో ప్రజలు గజమాలలతో, మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. కేశవ్ మాట్లాడుతూ వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మండలంలోని కెంచానపల్లి, జుంజురంపల్లి, బీఎనహళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
కళ్యాణదుర్గం అభివృద్ధే నా లక్ష్యం అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర, పోలేపల్లి గ్రామాలలో కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ంందర్భంగా సురేంద్రబాబు, పార్థసారథిలకు నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.
గాజు గ్లాసు గుర్తు ఎలా వచ్చిందో తనకు తెలుసునని.. స్థానిక నేతల వత్తిడితోనే కొంతమంది అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఆ గుర్తు కేటాయించారని జగ్గంపేట ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోకు...సీఎం జగన్ (CM Jagan) మేనిఫెస్టోకు చాలా తేడా ఉందని చెప్పారు. జగన్ మేనిఫెస్టోను చూస్తే అతని మనస్సు ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్, లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన అంశం అగ్గిరాజేసింది. కోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య స్పష్టం చేశారు. గాజు గ్లాసు గుర్తు అంశంపై కూటమి నేతలు వివరించామని పేర్కొన్నారు. అయినప్పటికీ సీఈవోకు అర్థం కాలేదని తేల్చిచెప్పారు.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అయితే ఈ యాక్ట్‌తో పేదలు చాలా నష్టపోతారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దేశంలో తొలిసారి అమలవుతోన్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ యాక్ట్ వల్ల ప్రజల్లో ఉన్న అపోహలు, భయాందోళనలకు సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) సరైన వివరణ ఇచ్చారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు దిమ్మతిరిగేలా జగన్ కౌంటర్ ఇచ్చారు.
విజయవాడ: పశ్చిమ నియోజకవర్గ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 39వ డివిజన్‌లో జరిగిన ప్రచారంలో ఆయనతోపాటు వంగవీటి రాధా కృష్ణ పాల్గొన్నారు.
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్‌లో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సుజనాతో కలిసి వంగవీటి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో సుజనా చౌదరికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. కొన్ని ప్రధాన సమస్యలను సుజనాకు సీనియర్ సిటిజన్స్ వివరించారు.