Home » East Godavari
ఆత్రేయపురం, నవంబరు8(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శిం
Andhrapradesh: అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడంతో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో నిందితుడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వీరబత్తుల చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పిఠాపురంలో మహిళా అఘోరి ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. పాదగయ క్షేత్రానికి అఘోరి నగ్నంగా వచ్చింది. పాదగయలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవి పురోహుతికా అమ్మవార్లకు అఘోరి పూజలు చేసింది. ఈ క్రమంలో అఘోరిని తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో సోమవారం డిప్యూటీ సీఎం పర్యటించి ఈ రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటన తొలుత ఈనెల 4,5వ తేదీల్లో ఉంటుందని ప్రకటించారు. అయితే..
13 ఏళ్లుగా ‘ప్రత్యేక’ పాలన.. నేటికీ పంచాయతీల సంగతి అతీగతీ లేదు.. ప్రత్యేకాధి కారులు పట్టించుకోవడం లేదు..పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామా ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న ట్టుగా ఉంది.
కార్తీక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు సౌకర్యాల కల్పన, తెప్పోత్సవం, గిరిప్రదక్షణ లపై ఆదివారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ఈవో, చైర్మన్, పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Andhrapradesh: దసరా సెలవులు ఇవ్వడం లేదని పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. దీనిపై సదరు విద్యార్థిని తండ్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా చేయడంతో స్కూల్ యాజమాన్యం ఆ బాలిక పట్ల...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లిలో వాలంటీర్‌గా పనిచేసే జనుపల్లి దుర్గా ప్రసాద్ అనే యువకుడు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా గుర్తించిన పోలీసులు వైసీపీ నేత, మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు.
కాకినాడఅర్బన్, అక్టోబరు 20: కాకినాడలో మొదటిసారిగా ఐపీఎల్ తరహాలో జీపీఎల్ ప్రీ మియర్‌లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండ డం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. డిసెంబరు 1 నుంచి 12 వరకు గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కాకినాడలో నిర్వహిస్తారన్నారు. ఆదివారం ఆయన నివాసంవద్ద టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12రోజులపాటు
నగరాల్లో ఎటుచూసినా కాలుష్యం. కంటికి కనిపించకుండానే గాలిలో కలిసి హానికరంగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ కారణంగా పర్యావరణం దెబ్బతిం టోంది. గాలిలో తగ్గుతున్న నాణ్యతే దీనికి నిదర్శనం. దేశంలో చాలా నగరాల్లో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) సంఖ్య 100 దాటుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశమే. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లోను ఈ సంఖ్య ఒక్కోసారి 100 దాటుతోంది. ఈ సమస్య పరిష్కారానికే కేంద్రం ఎలక్ర్టికల్ వాహనాలపై దృష్టి పెట్టింది. దీంతో నెమ్మదిగా వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. పెట్రోలు వాహనాలతో పోలిస్తే ఖర్చు తక్కువ. పర్యావరణహితం కూడా. ఇప్పుడిప్పుడే సామాన్యులు సైతం ‘ఈవీ’ధంగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ-బైక్‌లు, ఈ-కార్లు, ఈ-ఆటోలు రోడ్ల మీద సందడి చేస్తున్నాయి.