Home » Earthquake
ముండ్లమూరు(Mundlamuru)లో మరోసారి భూప్రకంపనలు (Earthquake) కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు.
ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు మరోసారి భయాందోళలనకు గురిచేశాయి. ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం10.40గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.
ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ(శనివారం) దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు మండలాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.
ఈరోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. మండి నగరంలో ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ వరుసగా మూడు సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
ఆరేళ్ల క్రితం ఈదురు గాలులు.. ఈ ఏడాది ఆగస్టులో పెను గాలులు. లక్షలాది భారీ వృక్షాలు నెలకొరిగాయి. డిసెంబర్ 4వ తేదీ భూప్రకంపనలు వచ్చాయి. ఇవన్నీ మేడారం అటవీ కేంద్రంగా జరుగుతున్నాయి. అసలు ఇంతకీ మేడారంలో ఏం జరుగుతుంది?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో బుధవారం భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గాలులకు లక్షలాది చెట్లు నెలకొరిగాయి. మళ్లీ అదే ప్రాంతంలో భూమి కంపించింది.
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది.
సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ప్రజలు షాక్‌కు గురవుతుంటారు. అప్పటివరకూ అంతా మామాలుగా సాగిన వారి జీవితం.. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు.
ములుగు జిల్లా భూకంపంపై ప్రముఖ ఎన్‌జీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త నగేశ్ స్పందించారు. జన సంచారం లేని ప్రాంతంలో భూకంపం రావడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విశ్రాంత శాస్త్రవేత్త సంచలన విషయాలు వెల్లడించారు.