Home » Duddilla Sridhar Babu
కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్‌ను సమగ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
దావోస్‌లో తెలంగాణ దుమ్మురేపింది! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సరికొత్త రికార్డులు సృష్టించింది! రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది.
స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలుసుకున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకు వచ్చింది.
రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు.. సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలీమీడియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫోర్త్ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్‌పేటలో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కేంద్రం కూడా సహకరించాలని కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
‘‘పెట్టుబడులంటేనే తెలంగాణ అనేలా ఉండాలి. అందుకు తగ్గట్లుగా మన ప్రణాళికలను రూపొందించాలి. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇప్పటికే దేశంలో అందరి దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోంది.
నూతన ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా, అంకుర సంస్థలకు చిరునామాగా తెలంగాణ దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని అవమానించేలా బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు.
సెమీ కండక్టర్ (చిప్‌ల తయారీ), దాని అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్‌లో అత్యంత అనుకూల వాతావరణం ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.