Home » Duddilla Sridhar Babu
హైదరాబాద్ నగరంలో గతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 7183.13 ఎకరాల భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్రమంత్రి కుమారస్వామిని కోరారు.
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వైద్య ఆవిష్కరణలు కొత్త తరానికి శక్తినిస్తున్నాయని, ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పు వస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్న తెలంగాణలో కలిసి పనిచేసేందుకు ప్రపంచ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు.
తెలంగాణను ‘ప్రపంచ నైపుణ్య రాజధాని’గా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
అధికారంలో ఉన్నపుడు అపవిత్రంగా కనిపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. ప్రతిపక్షంలోకి రాగానే పవిత్రంగా కనిపిస్తుందా? అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బీఆర్‌ఎ్‌సను ప్రశ్నించారు.
పదవుల కోసం రాజకీయాల్లోకి రావొద్దని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మునిసిపల్ పరిధి రాంపల్లి దాయరలోని బాలవికాస కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండగా వారి విధులకు ఆటంకం కలిగించారంటూ
దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం అభివృద్ధికి ఎంత ఖర్చయినా నిధులు మంజూరు చేస్తామని, వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ పనుల్లో రాజీ పడొద్దని.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూవేగంగా పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేందుకు, వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.