Home » Drugs Case
చెట్ల పొదల్లో మనల్ని ఎవరు చూస్తారులే అనుకున్నారు. మత్తు ఇంజక్షన్లు వేసుకుంటూ.. మత్తులో మునిగి తేలుతున్నారు. ఇలా తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్‌లో బుధవారం మత్తు ఇంజక్షన్లు వాడుతున్న నలుగురు యువకులను డ్రోన్ కెమెరాతో నిఘా వుంచి పోలీసులు పట్టుకున్నారు.
ప్రేమ విఫలమై.. డ్రగ్స్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డ్రగ్స్ స్మగ్లర్‌గా మారాడు. గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో విక్రయిస్తూ హెచ్‌న్యూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కథనం ప్రకారం.. గాజులరామారానికి చెందిన హర్షవర్థన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ( Malnadu Restaurant Drug Party Case) ఈగల్ టీం దూకుడుతో వెళ్తుంది. మూడు పబ్ యజమానులపైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఈ మేరకు పబ్ యజమానులకు ఈగల్ టీం నోటీసులు జారీ చేసింది.
Malnadu Drugs Case: రాహుల్ తేజ్ కోసం నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. 2024 జనవరిలో డిచ్‌పల్లిలో రాహుల్ తేజ్‌పై డ్రగ్స్ కేస్ నమోదు అయ్యింది.
డ్రగ్స్ విక్రయాలు, కొనుగోళ్లలో సెలబ్రిటీలతోపాటు.. పోలీసు అధికారుల పిల్లల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
Malnadu Drug Case: మల్నాడు డ్రగ్స్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్‌ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకున్నారు.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా హెరాయిన్ రవాణా చేసి నగరంలో గుట్టుగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఆటకట్టించారు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీఎఫ్ పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అతని వద్ద రూ. 3లక్షల విలువైన 17 గ్రాముల హెరాయిన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
భాయ్.. బచ్ఛా ఆగయా..!’’ అంటూ కోడ్ భాషలో గంజాయి విక్రయించే మహారాష్ట్ర వాసి సందీప్, మరో 14 మంది వినియోగదారుల ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్ - ఈగల్ కట్టించింది.
Malnadu Drugs Case: డ్రగ్స్ సప్లై , విక్రయాలకు నైజీరియన్ యువతులతో డ్రగ్స్ ముఠా దందా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. నైజీరియా యువతలకు కమీషన్ ఆశ చూపించి డ్రగ్స్ దందా, వ్యభిచారం చేయిస్తున్నట్లు నార్కోటిక్ బ్యూరో విచారణలో వెల్లడైంది.
Malnadu Kitchen Drugs Case: గోవాలో నైజీరియన్ దేశస్థుడు నిక్ నుంచి కొకైన్, ఎమ్‌డీఎమ్‌ఏను కొనుగోలు చేశారని.. డ్రగ్స్ కోసం హాస్పిటల్ ట్రీట్మెంట్ పేరుతో 1.8 లక్షలు నగదు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. శ్రీ మారుతి కొరియర్ పేరుతో డ్రగ్స్ ప్యాకెట్లు సరఫరా అయినట్లు తెలుస్తోంది.