Home » Drugs Case
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. కోదాడ మండలం, నల్లబండగూడెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ సాధించాలన్న లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో అరెస్టులు చేస్తున్నామని ఎక్పైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ బీవీ కమలాసన్ రెడ్డి అన్నారు.
న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా.. ముంబై నుంచి ఎండీఎంఏ డ్రగ్స్(MDMA drugs)ను తెచ్చి నగరంలో విక్రయించడానికి ప్రయత్నించిన స్మగ్లర్‌ను టీజీ న్యాబ్, హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) సంయుక్తంగా అరెస్టు చేశారు.
డ్రగ్స్ మాఫియా మరోసారి పడగ విప్పింది. ఇక్కడి మార్కెట్‌పై డ్రగ్స్ ముఠాలు కన్నేశాయి. ఎన్నిసార్లు ఎంతమందిని అరెస్టు చేసినా.. భాగ్యనగరానికి అంటుకున్న డ్రగ్స్ మత్తు వదలడంలేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా స్మగ్లింగ్‌కు తెరలేపుతున్నారు.
విశాఖపట్టణానికి బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ షిప్‌లో భారీగా డ్రగ్స్ ఉన్నాయని, వాటి విలువ వేల కోట్లు ఉండొచ్చనే ప్రచారం జరిగింది. అప్పట్లో రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ప్రజలు సైతం డ్రగ్స్ దిగుమతి జరిగి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు..
ఎన్‌డీపీఎస్ (గంజాయి) కేసుల్లో రాష్ట్రంలోని పోలీసుల పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారని..
‘విశాఖపట్నం కంటెయినర్ డ్రగ్స్’ కథ కంచికి చేరింది. ఈ ఏడాది మార్చి 19న బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఒక కంటెయినర్‌లో డ్రై ఈస్ట్‌తో పాటు డ్రగ్స్ కొకైన్) ఉన్నాయని సీబీఐ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే.
‘‘డ్రగ్స్, గంజాయి కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంది. సదరు కేసులు కూడా నాలుగైదేళ్ల విచారణ తర్వాత న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. ఇకపై అలా కుదరదు. డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.
ఒడిశా నుంచి నగరానికి వచ్చి ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్న దంపతులను బేగంపేట పోలీసులతో కలిసి సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో 11 మంది వినియోగదారులనూ అదుపులోకి తీసుకున్నారు.
పలువురు కలిసి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు పడవల్లో వెళ్తున్న క్రమంలో అధికారులు కట్టడి చేశారు. విశ్వసనీయంగా సమాచారం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి ఏకంగా 500 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.