Home » Districts
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఐదు హామీల అమలుకు చంద్రబాబు సంతకాలు చేయడంతో టీడీపీ జిల్లా కార్యాలయంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తదితరులు చంద్రబాబు చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. వృద్ధులు, మహిళలకు స్వీట్లు తినిపించారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కూటమి ఘన విజయం సాధించి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఏపీ ...
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారిని కలెక్టర్ వినోద్‌కుమార్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మేళతాళాలతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో కలెక్టర్...
కూటమి విజయంతో వైసీపీతో అంటకాగిన అధికారుల్లో గుబులు మొదలైంది. నియోజకవర్గంలోని వివిధ శాఖల్లో ఐదేళ్ల పాటు వైసీపీకి కొమ్ముకాసిన సుమారు 55 మంది అధికారులు తట్టాబుట్టా సర్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బదిలీ ప్రయత్నాలను ప్రారంభించారు. వీరిలో మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు, ట్రాన్సకో తదితర శాఖల అధికారులు, ఎంపీడీఓ కార్యాలయాల అధికారులు, పంచాయతీ రాజ్ కార్యాలయ అధికారులు ఉన్నారు. వైసీపీ పాలనలో వీరందరూ ఆ పార్టీ నాయకులకు వంత పాడుతూ పబ్బం ...
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన ప్రారంభమైంది. జిల్లాలో అనంతపురం పార్లమెంటుతో పాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం(అర్బన), కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ మంగళవారం చేపడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఈ కౌంటింగ్ ప్రక్రియకు జేఎనటీయూలో ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ గత కొన్ని రోజులుగా కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ...
ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ముడి ఇనుప గనుల లీజు ప్రాంతాల హద్దులను గుర్తించేందుకు కేంద్ర బృందం గురువారం సర్వే ప్రారంభించింది. మైనింగ్ జరుగుతున్న కొండల్లో వారంరోజుల పాటు సర్వే నిర్వహిస్తామని ఈ బృందం తెలిపింది. కర్ణాటకలోని టుముటి, విఠలాపురం సరిహద్దుల్లో ఏడు మైనింగ్ లీజులు ఉన్నాయి. వాటి లీజు కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో లీజ్ రెన్యువల్ చేసేందుకు ఎనఐటీకే సీనియర్ ప్రొఫెసర్ సూరత హర్షవర్ధన నేతృత్వంలోని బృందం సర్వే చేస్తోంది. ఏడు మైనింగ్ లీజులు ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో ఆంధ్ర, కర్ణాటక అధికారులు ...
నాలుగో తేదీ తరువాత అధికారం ఉంటుందో లేదో..! దీపం ఉండగానే ‘ఇంటి స్థలాలను అమ్మేసుకోవాలి’ అనుకున్నట్లున్నారు అధికార పార్టీ నాయకులు. బుక్కరాయసముద్రంలో జగనన్న కాలనీ ఖాళీ స్థలాలను కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. కొందరైతే ఏకంగా ‘ప్లాట్ ఫర్ సేల్’ అని బోర్డు పెట్టి మరీ అమ్మేస్తున్నారు. తక్కవ ధరకే ఇంటి స్థలం వస్తుందనుకుని అమాయకులు వారి వలలో పడుతున్నారు. డబ్బులు చెల్లించి పునాదులు వేసుకుంటున్నారు. ఈ దందాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మీన మేషాలు లెక్కబెడుతున్నారు. ...
విద్యాశాఖ పరిధిలో ఎవరు ఏ తప్పు చేసినా ఆ శాఖ జిల్లా అధికారులు ‘దయ’ చూపుతున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా ‘విచారణ’ పేరిట కాలయాపన చేస్తూ.. తప్పులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక జరిగిన అనేక సంఘటనలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వందలాది మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పీడీలు అనంతపురం నగర శివారులోని ఓ డాబాలో విందు రాజకీయం చేశారు. ఏపీటీఎఫ్ నాయకులు రాజేంద్ర స్కూల్‌లో సమావేశయ్యారు. ఉల్లంఘనలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. తూతూ మంత్రపు వివరణలు తీసుకుని సరిపెట్టారు...
మండలలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు, అర్చన, నిత్యహోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకు ...
పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి శనివారం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహోత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి ...
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు జీవం పోసుకున్నాయి. అత్యధికంగా కళ్యాణదుర్గంలో 86.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కణేకల్లు 70.0, ఉరవకొండ 62.8, కుందుర్పి 58.6, వజ్రకరూరు 46.2, శెట్టూరు 44.2, బెళుగుప్ప 36.8, బొమ్మనహాళ్ 34.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల కారణంగా యల్లనూరు, పెద్దపప్పూరు, కూడేరు, పుట్లూరు, కుందుర్పి, పెద్దవడుగూరు, కంబదూరు, బెలుగుప్ప, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల్లో అరటి, బొప్పాయి, టమోటా, పత్తి పంటలు ...