Home » Dharma Reddy
తిరుమల పరకామణి కేసుకు సంబంధించి పట్టాభి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసు రాజీ తీర్మానం జరిగిన పాలకమండలి సమావేశంలో కరుణాకర్ రెడ్డి పాల్గొన్న ఫోటోను పట్టాభి బయటపెట్టారు.
తిరుమల పరకామణి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈకేసులో పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని సీఐడీ మరోసారి విచారణకు పిలిచింది.
జగన్ దొంగలకు పెద్దన్నలా నిలిచారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నారు కాబట్టే చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారని వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: ‘‘ధర్మారెడ్డి ఏమయ్యాడు... మాట్లాడడా’’ అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నా బయటకి రావాలన్నారు. వివేకా తరహాలో ఆయన్ని కూడా చంపేశారనే అనుమానం తమకుందంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి.. అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
వైసీపీ హయాంలో టీటీడీ పాలకవర్గంలో పని చేసిన ఆ పార్టీ నేతలపై హిందూ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ విషయంలో తమ మనోభావాలతో ఆటలాడుకున్నారంటూ టీటీడీ ఛైర్మన్ మాజీ వై.వి.సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పాలనాపరమైన, కీలకమైన అధికారుల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలల రావుని ప్రభుత్వం నియమించింది.
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని.. పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి, అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని.. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ధరారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు.
ఒకరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, మరొకరు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో ధర్మారెడ్డి. వీరిద్దరూ ‘హద్దులు’ మీరారంటూ విపక్ష బీజేపీ, టీడీపీ సహా పలు పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది...