Home » Delhi liquor scam
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ వీడింది. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరో 12 రోజులు పొడిగించారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. అరవింద్ కేజ్రీవాల్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను గోవా కోర్టు తిరస్కరించింది. 2017 గోవా ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదైంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జ్యుడీషియల్ కస్టడీలోనే విచారించేందుకు సీబీఐకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీర్పు
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై గతంలో అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. భారత్‌లోని ప్రతిపక్ష నేత కేసుకి సంబంధించిన నివేదికల్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ఆశిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అని ఆరోపించారు. గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై రీజాయిన్డెర్లు ఫైర్ చేశారు కవిత తరఫు న్యాయవాదులు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై కవిత తరపు న్యాయవాదులు రిజాయిన్డెర్లు ఫైల్ చేశారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.
మధ్యం కుంభకోణంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాక బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి బయటకు రాగానే అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియాలను ఆయన కలిశారు.