• Home » Delhi Excise Policy

Delhi Excise Policy

Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్‌పై 15న సుప్రీంకోర్టులో విచారణ

Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్‌పై 15న సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు, రిమాండ్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఈనెల 15న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈడీ అరెస్టును సమర్ధిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సవాలు చేశారు.

MLC Kavitha: కస్టడీలో ఉన్న కవితకు కొన్ని వెసులుబాట్లు.. అవేంటంటే..

MLC Kavitha: కస్టడీలో ఉన్న కవితకు కొన్ని వెసులుబాట్లు.. అవేంటంటే..

దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని సవాలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్ట్ కొట్టివేసింది. ఇక సీబీఐ కస్టడీకి అప్పగించడానికి సంబంధించిన పిటిషన్‌పై తీర్పును కోర్ట్ రిజర్వ్ చేసింది.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ వాదనలివే..

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ వాదనలివే..

లిక్కర్ కేసులో సీబీఐ వాదనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితది కీలకపాత్ర అని సీబీఐ చెబుతోంది. సౌత్ గ్రూప్‌‌నకు చెందిన వ్యాపారవేత్త సీఎం కేజ్రీవాల్‌ను కలిశారని తెలిపింది. లిక్కర్ బిజినెస్‌కు సహకరిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారన్నారు. లిక్కర్ వ్యాపారులను సీఎం కేజ్రివాల్‌కు కవిత కలిపారని సీబీఐ తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు.

Kavitha: కోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. రిలీఫ్ ఇవ్వలేమన్న న్యాయస్థానం..

Kavitha: కోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. రిలీఫ్ ఇవ్వలేమన్న న్యాయస్థానం..

సీబీఐ అరెస్టు కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) కు మరోసారి చుక్కెదురైంది. కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరాకరిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్టుపై అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ ఫైల్ దాఖలు చేశారు.

AAP: ఈడీ బెదిరింపులతోనే రాజ్ కుమార్ రాజీనామా.. అతిశీ కామెంట్స్..

AAP: ఈడీ బెదిరింపులతోనే రాజ్ కుమార్ రాజీనామా.. అతిశీ కామెంట్స్..

దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఇప్పటికే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను అరెస్టు చేసిన ఈడీ మరికొందకు ఆప్ నేతలపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైంది.

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..

Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Delhi Liquor Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయనున్న ఆప్

Delhi Liquor Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయనున్న ఆప్

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

Delhi Liquor Case: కేజ్రీవాల్ జైలులోనే...హైకోర్టులో దక్కని ఊరట

Delhi Liquor Case: కేజ్రీవాల్ జైలులోనే...హైకోర్టులో దక్కని ఊరట

లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ కు ఊరట దక్కలేదు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. అరెస్టు తర్వాత ఈడీ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని, ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్టు చేయడం చట్టనిబంధనలకు విరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది.

Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్ పిటిషన్ పబ్లిసిటీ కోసమే.. హైకోర్టు

Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్ పిటిషన్ పబ్లిసిటీ కోసమే.. హైకోర్టు

దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి