Home » CSK
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. దాదాపు లీగ్ స్టేజ్ కీలక దశకు చేరుకుంది. ఈ క్రమంలో మే 1 వరకు జరిగిన మ్యాచ్‌ల టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ డేటా లెక్కల ఆధారంగా బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ నివేదికను రూపొందించింది. సీఎస్కే మ్యాచ్‌లకు అత్యధిక మంది వీక్షిస్తున్నట్లు అందులో వెల్లడైంది.
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. లీగ్ దశలో మరో 19 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు ఒక్క టీమ్ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే జట్ల గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు.
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా కాలంపాటు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అశ్విన్ తన కెరీర్‌లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా పంచుకున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను సీఎస్కే చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. సంజు ఆటతీరుపై స్పందించాడు.
ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పూర్తిగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. సీఎస్కేకి 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్ కార్తిక్ శర్మ.. ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత చేసిన గన్ షాట్ సెలబ్రేషన్స్ గురించి మ్యాచ్ అనంతరం కార్తిక్ వివరించాడు.
రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. యువ బ్యాటర్ కార్తీక్ శర్మ (40 బంతుల్లో ......
చెన్నై సొంతగడ్డ చెపాక్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్.. కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించేసింది.