Home » CSK
చెపాక్ స్టేడియం వేదికగా ఎస్ఆర్‌హెచ్-సీఎస్కే సోమవారం తలపడనున్నాయి. ఈ సీజన్‌లో చెన్నైకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీంతో సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోని ఆడటంపై స్పందించాడు.
చెపాక్ వేదికగా మే 18న సీఎస్కే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా ధోని బరిలోకి దిగుతాడా? లేదా? అనే ప్రశ్న అభిమానులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఓ గుడ్ న్యూస్‌తో పాటు.. ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎల్ఎస్‌జీ బ్యాటర్లు మిచెల్ మార్ష్, పూరన్.. కాంబోజ్‌ను టార్గెట్ చేసి విజృంభించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్ అన్షుల్ కాంబోజ్ తీవ్రంగా విఫలమయ్యాడు. అతడు వేసిన 2.4 ఓవర్లలోనే ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం రవిశాస్త్రి.. అన్షుల్‌కు మద్దతుగా నిలిచాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఎల్ఎస్‌జీకి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎల్ఎస్‌జీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో సీఎస్కే.. కర్ణాటక ప్లేయర్ మెక్‌నీల్ హ్యాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. సీఎస్కేకి 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026 మరో కీలక సమరానికి సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన సీఎస్కే.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఎల్ఎస్‌జీ బ్యాటింగ్‌కు దిగనుంది.