Home » Crude Oil
ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.
అమెరికా-ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూత పడటం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో ప్రతీరోజూ 13 నుంచి 14 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోయిందని ఇంటర్ నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, పలు చమురు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటి బయటకు వచ్చాయి. సుమారు 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో ప్రయాణిస్తున్న పలు ట్యాంకర్లు సురక్షితంగా జలసంధిని దాటినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ వర్గాలు వెల్లడించాయి.
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌తో పాటు పలు దేశాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపుల గడువు(మే 16)ను పెంచకూడదని ట్రంప్ నిర్ణయించారు. అయితే, దేశీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుంచి చమురు దిగుమతులను మునుపటిలాగే కొనసాగిస్తామని భారత్ తేల్చిచెప్పింది.
అమెరికా ఆంక్షల మినహాయింపులు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇంధన సరఫరా విషయంలో భారత ప్రయోజనాలకు నష్టం జరగనివ్వబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హామీనిచ్చారు. ఇంధన సరఫరాకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ నెరవేర్చుతామన్నారు. త్వరలో భారత పర్యటనకు రానున్న లావ్రోవ్ ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.
దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి సమస్య లేదని, తగినన్ని క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన నివేదికలు వెల్లడించాయి
భారత్‌లో ఇంధన ధరలు పెరగకపోవడంపై పాక్ మంత్రి ఒకరు పలు అభినందనపూర్వక వ్యాఖ్యలు చేశారు. పాక్ దుస్థితికి గల కారణాలను కూడా వివరించారు.