Home » CPI
విజయవాడలో సీపీఐ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మానించారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.
మధ్య భారతంలో మారణహోమాన్ని ఆపి మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి అని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్లను హత్యాకాండగా ఖండిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని వామపక్షాలు కోరుతున్నాయి.
రాష్ట్రప్రభుత్వం.. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని బీజేపీ, సీపీఐలు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఆ పార్టీల నేతలు మాట్లాడుతూ... ఇప్పటికే అన్ని రకాల పన్నుల పెంపుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మళ్లీ విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు నిర్ణయించిందని ఆ పార్టీల నేతలు అన్నారు.
బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. "ట్రంప్ చెబితే యుద్ధం ఆగిపోయిందా?" అంటూ విమర్శలు చేశారు
కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్రం స్పష్టం చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేశారు. విధాన పరమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారనే దానిపై సమాధానం చెప్పాలన్నారు.
సింహాచల దుర్ఘటనపై సీపీఐ స్పందన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, గాయపడినవారికి మెరుగైన వైద్యం అవసరమన్నారు
పత్తి విక్రయాల నకిలీ ధ్రువపత్రాలు జారీ చేసి అక్రమ లాభాలు పొందిన జిన్నింగ్ మిల్లర్లు, సీసీఐ అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు విచారణలో చిక్కుకున్నారు. 60 వేల నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగించి, సాగు స్థలాన్ని పెంచి, భారీ లాభాలను సొంతం చేసుకున్నారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఆయన ప్రభుత్వంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాల గవర్నర్లందరూ ఆర్‌ఎస్ఎస్‌కి చెందినవారని, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ విమర్శించారు. గోశాల అంశాన్ని ఇక ముగించాలని, రాజధాని నిర్మాణానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది
వక్ఫ్ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మత ప్రాతిపదికన భూసేకరణ అనేదే అసంగతమని ఆయన విమర్శించారు