Home » Congress 6 Gurantees
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టరని.. ఆ పార్టీలోని నేతల గ్రూప్ రాజకీయాలే పడగొడతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. బుధవారం నాడు యాదాద్రి జిల్లాలో పర్యటించారు.
తెలంగాణలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ కోడ్ అయిపోగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్(Balram Naik) అన్నారు. బుధవారం నాడు మణుగూరులోని డీవీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
పదేళ్లు రాజకీయ దురహంకారoతో, కుటిల బుద్ధితో మాజీ సీఎం కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని పాలించారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి (KK Mahender Reddy) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత నెల రోజుల నుంచి పోన్ ట్యాపింగ్ అంశం తెర మీద నడుస్తోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లటం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తుక్కుగూడలో ఈనెల 6వ తేదీన ఏఐసీసీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసిందని.. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మంగళవారం నాడు తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి పరిశీలించారు. సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై నిర్వాహకులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత ఊరురా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) అన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలోనే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.
గత బీఆర్ఎస్ (BRS) పాలనలో జరిగిన మోసాలు అన్ని బయటకు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏమి న్యాయం చేశారో మాజీ మంత్రి కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు.
మాజీమంత్రి కేటీఆర్ తన జీవితంలో మొదటిసారి వరి పొలాల్లోకి దిగారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ లీలలు ప్రజలు చూశారని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో జరిగిన సభ కంటే.. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన జరగనున్న సభ పెద్ద ఎత్తులో విజయవంతమవుతుందని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) కి బీజేపీతోనే పోటీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రేపు(శనివారం) నల్గొండ ఎంపీ పరిధి ముఖ్యులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్రంలో మోదీ 10 ఏళ్ల దుర్మార్గ పాలనలో పలు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ (Madhu Yaskhi Goud) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. మధు యాష్కీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో (Congress) కీలక విషయాలపై చర్చించారు.