Home » CM Stalin
శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్ ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉంచడాన్ని తప్పుబడుతూ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్వారా కేంద్రం వివరణ కోరటంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ కూటమితో మాకేం నష్టం లేదు.. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చానీయాంశమైంది. అన్నాడీఎంకే, బీజేపీ వంటి ప్రధాన పార్టీలతోపాటు మరికొన్ని పార్టీలు జట్టుకట్టి మరో ఏడాదాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఊటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు రోజులు ఊటీలోనే ఉండనున్నారు. చెన్నై నుంచి కోవై విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా.. ఊటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు.
కన్నీరు వద్దు తంబీ.. మన వైద్యఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం నీకు తగిన వైద్యం అందేలా ఏర్పాటు చేస్తారు.. అంటూ ఓ దివ్యాంగ విద్యార్ధికి భరోసా ఇచ్చారు. ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయి అతని దీనస్థితిపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిపై సీఎం స్టాలిన్ స్పందించి భరోసా కల్పించారు.
మా ఓటమి కోసం ప్రతిపక్ష పార్టీలు తపిస్తున్నాయని, కానీ... వారు అనుకున్నట్లు అలాంటిదేమీ జరగబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. వారు ఎన్ని ప్రయోగాలు చేసినా.. ప్రజలు తమవైపే ఉన్నారన్నారు. అంతేగాక.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.
పింక్ ఆటోలను పురుషులు నడిపితే స్వాధీనం చేసుకుంటామని జిల్లా కలెక్టర్ రష్మి సిద్దార్ధ్ హెచ్చరించారు. చెన్నైలో మహిళలు, పిల్లల భద్రత దృష్టిలో పెట్టుకుని జీపీఎస్, క్యూ ఆర్ కోడ్ తదితర వసతులతో కూడిన ‘పింక్’ ఆటోలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు అంటూ పేర్కొన్నారు. 2026లో జరిగే ఎన్నికల్లో ఒకే వెర్షన్ మాత్రమేనని, అది రాష్ట్రంలో అన్నాడీఎంకే వెర్షన్ మాత్రమేనని ఈపీఎస్ తెలిపారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో మత ఉగ్రవాదాన్ని సహించబోమని కూడా పేర్కొన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాని, గవర్నర్ కార్యాలయమైన రాజ్‌భవన్‌ల మధ్య మళ్ళీ అగాదం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వానికా కొరకురాని కొయ్యగా మారిన గవర్నర్ ఆర్ ఎన్ రవి.. తాజాగా విడుదల చేసిన ప్రకటన పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. ఆ ప్రకటన సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే...
నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘నీట్’పై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.