Home » CID
అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు, దళిత ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ( Kolikapudi Srinivasa Rao ) హైదరాబాద్‌లోని నివాసానికి విజిటర్స్‌గా వచ్చిన ఏపీ సీఐడీ నానా భీభత్సం సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న కొలికపూడి పట్ల జగన్‌రెడ్డి వేధింపులు దుర్మార్గమని అచ్చెన్నాయుడు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్‌రావు ( Kolikapudi Srinivas Rao ) ను కొలికిపూడి శ్రీనివాసరావు భార్య మాధవికి ఏపీ సీఐడీ అధికారులు. నోటీసులు అందజేశారు. మూడో తేదీ గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్‌రావు ( Kolikapudi Srinivas Rao ) ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ( AP CID ) ప్రత్యేక బృందం హైదరాబాద్‌కి చేరుకున్నది. 8 మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్నది. కొలికపూడి హైదరాబాద్‌లో అందుబాటులో లేరని తన సతీమణి చెప్పినా వినడం లేదు.
AP CID: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ అంశంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు CID కోర్టును ఆశ్రయించారు. దీంతో నారా లోకేష్‌కు నోటీసులు ఇవ్వాలని CID న్యాయమూర్తి సూచించారు.
టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేశ్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌కు ఎన్‌బీడబ్ల్యూ (NBW) జారీచేయాలని పిటిషన్‌లో కోరింది. ఈ కేసులో లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలని సీఐడీ కోరింది.
Andhrapradesh: ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.
Jagan Govt Challanges HC Order In Supreme Court : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Chandrababu) స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) ఇవ్వడాన్ని జగన్ సర్కార్ (Jagan Govt) వ్యతిరేకిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.
ఏపీ పైబర్ నెట్ కేసులో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తోపాటు, కనుమూరి కోటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం తీర్పుపై సీఐడీ సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. మంగళవారం టీడీపీ కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వచ్చి.. కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చి వెళ్లారు.