Home » Chiranjeevi
హైదరాబాద్: 45 సంవత్సరాల సుదీర్ఘ సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ ఇచ్చిందని, తన కృషి , సేవతో పాటు తన అభిమానులు, ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు టెక్నిషియన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రముఖ నర్తకి వైజయంతీ మాల బాలికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలో రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందజేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ వేదికగా పద్మవిభూషణ్ సంధించిన పలు ప్రశ్నలకు.. కిషన్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇంటర్వ్యూకు ముందు.. ‘‘ నా చిరకాల మిత్రుడు, శ్రేయోభిలాషి, తెలుగుజాతి గర్వపడే మెగాస్టార్ చిరంజీవి గారు ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని అందుకుంటున్న తరుణంలో వారిని కలిసి అభినందించిన సందర్భంలో జరిగిన ఆత్మీయ భేటి’ అంటూ ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఇంటర్వ్యూను ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’లో లైవ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా చూడగలరు.
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పద్మవిభూషణ్ అవార్డు(Padma Vibhushan Award) అందుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించనున్నారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహలు రచిస్తోంది. ఈక్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు.
Andhrapradesh: ‘‘మన అభిమాన హీరో చిరంజీవినే అవమానించిన జగన్ ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం మండపేట బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతూ... ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని.. రైతాంగానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు.
పవన్ కల్యాణ్ భీమవరం సభలో చాకు కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు చాకుతో సభకు హాజరయ్యారు. సదరు వ్యక్తుల కదలికలను అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వెదకగా జేబులో చాకులు లభ్యమయ్యాయి. భీమవరం బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు. టూ టౌన్ పోలీసులు అదుపులో ఇద్దరు యువకులు ఉన్నారు.
సినీనటులు చిరంజీవి తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం మంచిదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో తలెత్తిన నీటి సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. వందల మంది క్యూ లైన్‌లో నిల్చొని.. బిందెల్లో నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని నీటి సమస్యని అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్నారు.