Home » Chennur
మండలంలోని కిష్టంపేట గ్రామంలోని వరలక్ష్మీ జిన్నింగు మిల్లు ఎదుట పత్తికి మద్దతు ధర చెల్లించాలని రైతులు శుక్రవారం చెన్నూరు-మం చిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహిం చారు.
రైసుమిల్లుల యజమానులు ధాన్యం బకా యిలు ప్రభుత్వానికి చెల్లించకుంటే చట్టపర మైన చర్యలు తప్పవని సివిల్ సప్లయి టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం ముదిగుంట గ్రామం లోని బీఎస్‌వై రా రైసుమిల్లు, టేకుమట్ల గ్రామంలోని బాలాజీ రైసుమిల్లులను తని ఖీ చేశారు.
దివ్యాంగుడు బచ్చు సురేశ్‌బాబుకు తీర ని అన్యాయం చేసిన కొండపేట వాసి మంజుల, ఆమె భర్త శివరామిరెడ్డి అన్న విజయభాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని వికలాంగుల హక్కుల పోరా ట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నం సుబ్బయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఎరుకల సమ స్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర సలహాదా రులు శ్రీరాములు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీని వాస్, లోకిని రాజు, రేవెల్లి రాజలింగు, రమేష్‌లు పేర్కొన్నారు. ఆదివారం చెన్నూరులో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ప్రజలకు అందు బాటులో ఉండి అంకితభావంతో విధులు నిర్వర్తిం చాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీచేశారు. ప్రాణహిత సరిహద్దు గ్రామాలు, కేసుల నమోదు, మావోయిస్టుల ప్రాబల్యం, తదితర అంశాలను తెలుసుకున్నారు.
చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని చెన్నూరు కోర్టు జడ్జి రవి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు.
రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌ను సీపీ శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను సందర్శించి పిటిషన్, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, కేసు లలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, మిస్సింగ్, కైరమ్ కేసులలో ప్రధానమైన సాక్ష్యులతో మాట్లాడి వివరాలు సేకరించాలని సూచించారు.
విద్యార్థులు విభిన్న తార్కిక ఆలోచనల ద్వారానే శాస్త్రవేత్తలుగా తయా రవుతారని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరి షత్ పాఠశాలలో అటల్ టింకర్ ల్యాబ్ ప్రాజెక్టుల ప్రదర్శనలో భాగంగా ల్యాబ్‌లో విద్యార్థుల ప్రదర్శన లను పరిశీలించారు.
మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
మండల కేంద్రంలోని రైతు వేది కలో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మంచినీటి సహాయకుల శిక్ష ణ తరగతులు కొనసాగుతున్నాయి. గురువారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు మాట్లాడారు.