Home » Chennai News
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కలిగించినా అన్నాడీఎంకే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నవంబర్ 5వ తేదీ కరూర్‌కు రానున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రకటించింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధ్యక్షుడు విజయ్ గత నెల 27న కరూర్ పర్యటించిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందడం దేశవ్యాప్తంగా కలకలంరేపిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో రెండో విడతగా అర్హులైన గృహిణులకు కలైంజర్ మహిళా సాధికార పధకం కింద ప్రతినెలా రూ.1000 చెల్లించనున్నట్లు ప్రత్యేక పథకాల అమలు మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ప్రకటించారు.
కరూర్‌లో ‘తమిళగ వెట్టి కళగం’ (టీవీకే) రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందటానికి ఆ పార్టీ నాయకుడు ఏడు గంటలు ఆలస్యంగా రావటమే కారణమని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో చెన్నై నుండి కన్నియాకుమారి వరకు ఈ నెల 17 నుండి 18వరకు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
దీపావళి పండుగను పురస్కరించుకుని ఈరోడ్ వారాంతపు సంతలో రూ.7 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగింది. ఈ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం రాత్రి వారాంతపు వస్త్ర సంత నిర్వహిస్తుంటారు.
దీపావళి రోజున రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సచివాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... దీపావళి పండుగలో భాగంగా పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చేందుకు ఇష్టపడతారని తెలిపింది.
పచ్చటి ప్రకృతి, రమణీయమైన కొండల సోయగాల నడుమ నడిచే నీలగిరి జిల్లా ఊటీ కొండ రైలు బుధవారం 117వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా ఊటీ రైల్వేస్టేషన్‌లో కేక్ కట్ చేసి సంబరాలు జరపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
తమిళనాడు దిండుగల్ జిల్లా నిలకోట సమీపంలోవున్న రామనాయకన్‌పట్టిలో కులాంతర వివాహం చేసుకున్న రామచంద్రన్ (24) అనే యువకుడు దారుణహత్యకు గురైన నేపథ్యంలో, పోలీసులు పరువుహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామచంద్రన్ పాడిపశువులు పెంచుతూ ఇంటింటికీ పాలు సరఫరా చేస్తూ, తమ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు.
అన్ని పార్టీల ఓట్లను తమిళగ వెట్రి కళగం (టీవీకే) తప్పకుండా చీలుస్తుందని, ఇందువల్ల కూటమికి నష్టంవాటిల్లకుండా అధికార డీఎంకే చర్యలు తీసుకోవాలని కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి (కేఎండీకే) ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఈశ్వరన్ అభిప్రాయం వ్యక్తంచేశారు.