Home » Chandrababu
రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందామన్నారు. 2014-19 మధ్య కాలంలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచామన్నారు.
సీఎం చంద్రబాబుపై ఉన్న 7 కేసులను సీబీఐకు అప్పగించాలని వేసిన పిటిషన్‌పై హైకోర్ట్‌లో విచారణ జరిగింది. పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ అభ్యంతరం లేవనెత్తారు. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పారు.
ఏపీ అసెంబీ సెషన్ (AP Assembly Session) 5వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఏపీ ప్రజలు కూటమికే ఓటేశారు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు కట్టబెట్టి అధికారమిచ్చారు. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా.. సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు దక్కాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక ఎక్కడా చూసినా పసుపు జెండాలే రెపరెపలాడుతున్నాయి.
ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేయనున్న కూటమి అభ్యర్థిపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కసరత్తు ప్రారంభించినప్పటికీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (గురువారం) పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan) పూర్తి విభిన్నం. ప్రజలు అధికారం కట్టబెడితే ఐదేళ్లపాటు పరదాల చాటున తిరిగారు వైసీపీ అధినేత. కానీ చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల మధ్య, ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద స్వయంగా రెండు చీరలు కొనుగోలు చేశారు.
నేడు కలెక్టర్లు, ఎస్పీల సమావేశం జరగనుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో సమావేశం జరగనుంది.