Home » Chandra Babu
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునఃనిర్మాణం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందింది.
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని.. పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి, అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని.. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ధరారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు.
అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరికి బుధవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
ఏపీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. మరో వారం రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కువమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా పర్యటనా ముగించుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి చేరుకున్నారు. చంద్రబాబు దంపతులకు అభిమానులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సన్మానించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కంబోడియాలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామంటూ ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ చేసిన ట్వీట్‌కు చంద్రబాబు ఎక్స్‌లో రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ తెర ముందు, తెర వెనకా ఓ లెజెండ్ అని కొనియాడారు. పేదల సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణతో ఎన్టీఆర్ మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు.
పోలింగ్‌కు ముందు డికోడర్ ఛానల్‌కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలను ట్విటర్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ప్రణయ్ రాయ్, దొరబ్‌లు అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పారు. ఇంటర్వూ ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పారు. జగన్ ఏం చెప్పారు? అసలు వాస్తవమేంటో చూద్దాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి (74) ఇక లేరు.
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి(74) హైదరాబాద్‌లోని తన కుమార్తె హంసిని ఇంటిలో సోమవారం వేకు వ జామున గుండెపోటుతో కన్నుమూశారు.