Home » CBI
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఢిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతిస్తూ తీర్పునిచ్చింది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ(CBI). ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది సీబీఐ. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి(Sharath Chandra Reddy).. కవిత జాగృతి సంస్థకు ..
లిక్కర్ కేసులో సీబీఐ వాదనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితది కీలకపాత్ర అని సీబీఐ చెబుతోంది. సౌత్ గ్రూప్‌నకు చెందిన వ్యాపారవేత్త సీఎం కేజ్రీవాల్‌ను కలిశారని తెలిపింది. లిక్కర్ బిజినెస్‌కు సహకరిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారన్నారు. లిక్కర్ వ్యాపారులను సీఎం కేజ్రివాల్‌కు కవిత కలిపారని సీబీఐ తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి.. తిహాడ్ జైలులో ఉన్న కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్‌కు తెలిపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Liquor Scam Case) అరెస్టై.. తిహాడ్(Tihar) జైల్లో ఉన్న కవితను(Kavitha) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)(CBI) అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్‌కు(Anil) తెలిపింది. ఆమె అరెస్టును సవాల్ చేస్తూ.. కవిత తరఫున న్యాయవాది మోహిత్‌రావు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులోని(Rouse Avenue Court) ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బంపర్ ఆఫర్ ఇఛ్చారు. డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అమిత్ షాకు పిలుపు నిచ్చారు. పోని ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయకుంటే.. ఈడీ, సీబీఐ,ఎన్ఐఏ డైరెక్టర్లు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ ఇంటరాగేషన్ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు తప్పుబట్టారు. సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ రౌజ్ అరెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఈనెల 26న సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కవితను తీహార్ జైల్లో విచారించామని కోర్టుకు సీబీఐ తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ వీడింది. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.