Home » CBI
ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చోటు చేసుకున్న అవినీతి రాకెట్‌ను సీబీఐ ఛేదించింది. ఆసుపత్రిలో అవినీతికి పాల్పడుతున్న 9 మంది సిబ్బందిని సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. వారిలో ఇద్దరు వైద్యులతోపాటు సీనియర్ ల్యాబ్ ఇన్‌చార్జ్ ఉన్నారు.
సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ‘మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు హవాలా డబ్బు వెళ్లింది’ అని బెదిరించి నగరవాసి నుంచి రూ. 91.64 లక్షలు కాజేశారు.
అవినీతి, ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. కరీంనగర్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్రయల్ కోర్టు రౌస్ అవెన్యూలో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దాంతో హైకోర్టును ఆశ్రయించాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు.
సీబీఐపై తమ కంట్రోల్ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు(Supreme Court) తేల్చిచెప్పింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 131 ప్రకారం ఈ కేసు వేసింది.
న్యూఢిల్లీ: జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అనేక విషయాలను సీబీఐ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేసుకు సంబంధించి పలు కీలక అంశాలు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మణిపుర్ అల్లర్ల కేసులో సీబీఐ(CBI) ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఇందులో మణిపుర్ పోలీసుల వైఖరి, వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకల దాడులు జరుగుతున్న క్రమంలో సాయం కోరడానికి వచ్చిన బాధితులను ఏ మాత్రం పట్టించుకోకుండా మూకలకు సహకరించారని ఛార్జ్ షీట్‌లో వెల్లడించారు.
పాధ్యాయుల భర్తీ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ స్కాంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన ట్రయల్ కోర్టు. నేడు వర్చువల్ గా కవితను అధికారులు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టు ముందు దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనునున్నారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జడ్జి కావేరి బవేజ మే 2కు రిజర్వ్ చేశారు. కాసేపటి క్రితమే లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అరెస్ట్‌లో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగగా... కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలన్నారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు.