Home » Canada
కెనడా 41 మంది దౌత్యవేత్తలను భారత్ నుంచి ఉపసంహరించుకున్నాక ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudo) స్పందించారు. ఇండియా నిర్ణయాలు లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆయన అన్నారు.
భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తత ఇప్పుడప్పుడు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ ఇరుదేశాల మధ్య వైరం సుదీర్ఘకాలం కొనసాగేలా కనిపిస్తోంది. ఇందుకు తాజా పరిణామాలే సాక్ష్యం..
కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలకు భారత్ తాజాగా తీవ్రంగా స్పందించింది. సమతూకం పాటించేందుకు చేసే ప్రయత్నాలను అంతర్జాతీయ నియమాల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నాలను ఖండిస్తున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
భారత ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన తరువాత కెనడా ప్రభుత్వం 41 మంది దౌత్యవేత్తలను(Diplomats) ఉపసంహరించుకుంది. ఒట్టావా ప్రతీకార చర్యలు తీసుకోదని విదేశాంగ మంత్రి మెలానీ జోలి అన్నారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు.. రెండు దేశాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు...
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఇప్పుడు పూర్తిగా మెత్తబడినట్టు తెలుస్తోంది. నిన్నటిదాకా భారత్‌తో దేనికైనా రెడీ అన్నట్టు వ్యవహరించిన ట్రూడో...
కెనడాలోని అంటారియో ప్రావిన్స్ (Ontario province) లో దొంగలు హిందూ దేవాలయాలనే (Hindu Temples) టార్గెట్‌గా చేసుకుని వరుస లూటీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ నెలలో మూడు దొంగతనాలు జరిగాయని తెలియజేస్తూ డర్హామ్ పోలీసులు బుధవారం ఆధారాలతో సహా వివరాలు వెల్లడించారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనే కెనడా ఆరోపణలతో రెండు దేశాల మధ్య కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాల విదేశాంగ మంత్రులు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది.
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాదుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా వాళ్లు చేస్తున్న కార్యకలాపాలు...
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య తారాస్థాయిలో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణం ఎవరు? అని ప్రశ్నిస్తే.. ఎవ్వరైనా ఠక్కున కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అని చెప్పేస్తారు. ఎందుకంటే.. తనకొచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా