Home » Botcha Sathyanarayana
ఉత్తుత్తి బటన్లు నొక్కినట్టే.. ఉత్తుత్తి హామీలివ్వడం ఆపై చేతులెత్తేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి పరిపాటిగా మారింది! ఏడాదికో సంస్కరణ పేరుతో స్కూళ్లను భ్రష్ఠు పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే ఇంగ్లీషు మీడియం అంటూ ఊదరగొట్టింది.
సీఎం జగన్ బటన్ నొక్కి రోజులు గడుస్తున్నా ఇంకా చాలామంది లబ్ధిదారులకు అమ్మ ఒడి పథక నిధులు జమ కాలేదు. అసలు ఈ డబ్బు ఖాతాల్లో జమ అవుతాయా లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది లబ్ధిదారులకు జమ కావడం, మరికొంత మందికి డబ్బు పడకపోవడంతో డివిజన్లలో తిరుగుతున్న వలంటీర్లకు అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలపై వేటు పడింది. ఒకేసారి 180 కాలేజీలు మూతపడబోతున్నాయి. ఆ కాలేజీలకు రాబోయే మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులు ఖరారు చేయకపోవడం మూసివేతకు కారణమైంది. వాటిలో 30 కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలు సమర్పించలేదని, మరో 150 కాలేజీల్లో గత మూడేళ్ల కాలంలో 25 శాతం కూడా అడ్మిషన్లు లేవని వెల్లడిస్తూ ఉన్నత విద్యాశాఖ
సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే చెల్లింపులు జరిగిపోతున్నాయి. సర్కారు ఆర్‌బీఐ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ద్వారా నగదు జమ చేస్తోంది. బిల్లులు ముందే అప్‌లోడ్ చేస్తే అర్ధ పనిదినంలో లబ్ధిదారులందరి ఖాతాల్లో డబ్చు వేసేయొచ్చు. అయినా కొందరికే అమ్మఒడి పడింది. ఎందుకంటే... ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. కొత్త అప్పు తెస్తే కానీ ఇవ్వలేని పరిస్థితి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టేలర్ హైస్కూల్ పేరు వింటే.. 170 ఏళ్ల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, టెట్రాసైక్లిన ఇంజక్షన కనిపెట్టిన యల్లాప్రగడ, దర్శకుడు బాపు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు వంటి మహానీయులు చదువుకున్నది ఇక్కడే. ఈ పాఠశాలకు సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
జగనన్న ఆణిముత్యాలు’ అంటూ ఊదరగొట్టిన వైసీపీ ప్రభుత్వం... చివరికి ఆ పథకానికి కావాల్సిన నిధులను ఇంటర్ విద్యామండలి నుంచి లాగేసింది. టెన్త్, ఇంటర్‌లో టాపర్లకు ఆణిముత్యాలు పథకం కింద ఈ నెల 20న నగదు బహుమతులు పంపిణీ చేశారు. దీనికోసం ఇంటర్ బోర్డు డబ్బులు వాడేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. 2.12 లక్షల మంది సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 1.9 లక్షల మంది మాత్రమే ఎగ్జామ్స్ రాశారు. ఆన్‌లైన్ విధానంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థులు
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నామమాత్రంగా మారిపోతున్నాయి. సగం సగం డిగ్రీ కోర్సులతో ఇంకా ఎన్నాళ్లు ఉంటాయో అన్న పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సింగిల్ మేజర్‌లోకి మారిన నేపథ్యంలో
చంద్రబాబు వ్యాఖ్యలను బొత్స తప్పుపట్టారు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడుతున్నారా? అని అడిగారు. నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఏమైంది? అని
ప్రభుత్వం ఆర్భాటంగా ఇస్తున్న ‘జగనన్న విద్యాకానుక’ నాణ్యతలో ఉన్న డొల్లతనం పాఠశాలలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకుండానే బయటపడుతోంది. ఈ జగనన్న కానుకతో విద్యార్థులు ఒక రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు మరో రకమైన తలనొప్పులు